మే 20, 2011
నోముల కథా పురస్కారం – 2011
ఈ క్రింది విషయం ఈ వారం నవ్యలో ప్రకటనగా వచ్చింది (ఆరవ పేజి). అక్షరజాలంలో ప్రకటించగలరు.
నోముల కథా పురస్కారం 2011 కు గాను తెలుగు కథలను ఆహ్వానిస్తున్నాం.
బహుబాషావేత్త, సాహితీ విమర్శకుడు డాక్టర్ నోముల సత్యనారాయణ పేరున కథా పురస్కారాలను 2010 నుంచి ఇస్తున్న విషయం తెలిసిందే!
ఈ పోటీకి పంపే కథలు ఇంతకు ముందు ప్రచురితం కానివై ఉండాలి. కథా వస్తువు, నిడివి విషయాలలో ఎటువంటి నియమాలూ లేవు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతుల కింద నగదు, జ్ఞాపిక, అందజేస్తాం. నోముల జన్మదినమైన ఆగష్టు 10 న నల్లగొండలో జరిగే కార్యక్రమంలో బహుమతి ప్రదానం వుంటుంది.
ఎలిశెట్టి శంకర్ రావు, ఫ్లాట్ నెం. 206, సాయి టవర్స్, నాగార్జున కాలనీ, నల్లగొండ. చిరునామాకు కథలు పంపాలి.
కథలు పంపేందుకు చివరి తేదీ జూన్ 20, 2011.
అరిపిరాల సత్యప్రసాద్
పంతుల జోగారావు said,
మే 20, 2011 at 12:50 సా.
మీ వసుందధర అక్షర జాలం లో నవ్య నీరాజనంగా వచ్చిన కథకుల లింక్ ల 90 తరువాత మానేసినట్టుగా ఉన్నారు ? వీలు చూసుకుని మిగతావి పెడతారా? కథల గురించి, పుస్తకాల గురించి, పోటీల గురించి, పత్రికల గురించి, పోటీ ఫలితాల గురించించి ఎప్పటి కప్పుడు సమాచారం అందించే మీ ప్రయత్నం చాలా హర్షణీయం.