జూన్ 7, 2011

ఆంధ్రభూమి నవలల పోటీ

Posted in కథల పోటీలు at 7:27 సా. by వసుంధర

ఆంధ్రభూమి దినపత్రిక నవలల పోటీ నిర్వహిస్తోంది.

మొదటి బహుమతి రూ. 50,000

రెండవ బహుమతి రూ. 25,000

ఇతివృత్తం: వస్తువులో, కథన శైలిలో కొత్తదనం కావాలి. వృద్ధులైన తలిదండ్రులకు పిల్లల నిరాదరణ, అత్తల ఆరళ్లు, కోడళ్ల కుత్సితం లాంటి అరిగిపోయిన ప్లాట్లు అసలొద్దు. ఈ కాలపు జీవన రీతికి, ఈ తరం అభిరుచులకు, మారుతున్న విలువలకు కొత్త కోణంలో అద్దంపట్టగలిగితే మంచిది. సస్పెన్స్ థ్రిల్లరో, అపరాధ పరిశోధనో, జానపదమో, చారిత్రకమో, శృంగారమో, హాస్యమో ఐనా అభ్యంతరం లేదు. విషయం ఏదైనా వేగం ముఖ్యం. చదువరికి ఉత్కంఠ కలిగించటం ప్రధానం.

ఇతర నియమావళి:  నవల నిడివి డైలీ సీరియల్‌గా 40 రోజులు వచ్చేట్టు ఉండాలి. మామూలు దస్తూరిలో నవల 150 పేజీలు డాలి. కాగితానికి ఒకేవైపు రాయాలి. స్క్రిప్టు కాగితాలను విడిగాకాక కుట్టి పంపాలి. ఇ-మెయిల్‌లో కాక కొరియర్/ పోస్టుద్వారా మాత్రమే పంపాలి.  రచయిత పేరు (కలం పేరు వాడితే) అసలు పేరు, చిరునామా, ఫోన్ నంబరు స్పష్టంగా రాయాలి. రచన తన సొంతమనీ, దేనికీ కాపీ కాదనీ, అనుకరణ, అనుసరణ కూడా కాదనీ, వేరే ఏ పోటీకి పంపలేదని ఇంకే పత్రిక పరిశీలనలో లేదని హామీపత్రం తప్పనిసరిగా జతపరచాలి. ఇష్టమైతే ఫొటో కూడా పంపవచ్చు.  గతంలో ఆంధ్రభూమి, దిన, వార, మాస పత్రికలకు పంపితే తిరిగొచ్చిన వాటిని పంపకూడదు. రచన సొంత దస్తూరితో కాని, డి.టి.పి చేసి గాని పంపాలి. జిరాక్స్ కాపీలు, కార్బన్ కాపీలు పరిశీలించబడవు.  సాధారణ ప్రచురణకు కూడా స్వీకరించని రచనలను తిప్పి పంపాలంటే తగిన స్టాంపులు అతికించి చిరునామా రాసిన కవరు జతపరచాలి. స్టాంపులు, కవరు విడిగా పంపితే గల్లంతు కావచ్చు.

ఆఖరు తేదీ: ఆగస్టు 31, 2011

చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 500 003.

పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Leave a Reply

%d bloggers like this: