జూన్ 9, 2011

సంస్కృతం విశిష్టత

Posted in సాహితీ సమాచారం at 3:40 సా. by వసుంధర

ఈ క్రింది సమాచారం పంపినవారు ఎం. శ్రీదేవి. వారికి ధన్యవాదాలు. ప్రస్తుతం ఇలాంటి సమాచారాన్నీ, విశేషాలనీ పంచుకోవడం భాషకీ, సాహిత్యానికీ, సంస్కృతికీ ఎంతో అవసరం. సహకరించవలసిందిగా అందరికీ మనవి. 
పాలిండ్రోమ్ విషయంలో ఆంగ్లేయులు ‘able was I ere I saw Elba’ అనే వాక్యాన్ని గొప్పగా చెప్పుకుంటారు. ఈ వాక్యం ఎటునుంచి చదివినా ఒకలాగే ఉంటుంది. దీని అర్థం- ఎల్బాని చూసే మునుపు వరకు నేను సమర్థుడిగానే ఉన్నాను. ఎల్బా అనేది ఒక వ్యక్తి పేరు. Ere అంటే మునుపు అనే అర్థం ఉంది. ఇది 17వ శతాబ్దం నాటి వాక్యమని చెబుతుంటారు. ఇదే గొప్పనుకుంటే 14వ శతాబ్దంలోనే దైవజ్ఞ సూర్య అనే ఆయన రామకృష్ణ విలోమ కావ్యం రచించాడు. ఈ కావ్యంలో మొత్తం రమారమి 40 శ్లోకాలు ఉన్నాయిట.
తాం భూసుతా ముక్తి ముదారహాసం
వదేయతో లవ్య భవం దయాశ్రీ
ఇదే వెనకనుంచి మొదటికి చూస్తే 
శ్రీ యాదవం భవ్యలతోయ దేవం
సంహారదాముక్తి ముతా సుభూతాం   
ఆవుతుంది.
మొదటి శ్లోకంలో భూసుతా అంటూ సీతను గురించి, రెండవదాంట్లో శ్రీ యాదవం అంటూ కృష్ణుని గురించి ప్రస్తావిస్తున్నట్లు అర్థమౌతూనే ఉంది. ఇక అర్థాల్లోకి వెళితే దరహాసం చిందే లవుని ప్రేమించే దయగల లక్ష్మియైన ఆ సీతకు నమస్కరించుచున్నాను అని మొదటి రెండు పాదాలకు అర్థం. రెండవదానికి మంగళప్రదమైన ఆకర్షణగలవాడైన కృష్ణుని గీతబోధ చెడుని సంహరిస్తూ ప్రాణప్రదమైనది అని అర్థం. ఎంతటి విన్యాసమో చూడండి. ఇలా మొత్తం కావ్యం కొనసాగుతుందన్న మాట!
స్థూలంగా చూసినా సూక్ష్మంగా పరీక్షించినా సంస్కృతం ప్రపంచ భాషలన్నింటిలోకీ ఉత్తమమైనది. భాషావేత్తలంతా ముక్తకంఠంతో పలుకగలిగే నగ్నసత్యమది.                                            

14 వ్యాఖ్యలు »

  1. venkat said,

    నమస్తే. ఆ పూర్తి అర్థ తాత్పర్యాలతో రామ కృష్న విలోమ కావ్యం నాకు కూడా దయచేసి పంపండి. నా మెయిల్ ఐడీ.
    dpgch18@gmail.com
    నమస్తే.
    Venkat


Leave a Reply

%d bloggers like this: