జూన్ 19, 2011

భాషానందం

Posted in భాషానందం at 11:53 ఉద. by వసుంధర

అన్ని ప్రేమల్లోకీ తల్లిప్రేమ గొప్పదంటారు. భాష కూడా తల్లివంటిదే కాబట్టి చాలామంది భాషని తల్లికి వలే ప్రేమిస్తారు. దురభిమానం కాని భాషాభిమానం మనిషికీ మానవత్వానికీ ఆరోగ్యకరం. ఈ శీర్షికలో భాషాభిమానాన్ని పంచుకుంటూ భాషానందాన్ని పొందుదాం.  సంస్కృతంలో విలోమ కావ్య విశేషాలు ఈ శీర్షికలో తెలుసుకున్నాం. దానికి స్పందనగా నండూరి శ్రీనివాస్ తెలుగులో ఓ విలోమ విశేషాన్ని ఇలా చెప్ప్పారు.
పారిజాతాపహరణం పంచమాశ్వాసంలో నంది తిమ్మనగారు కూడా, విష్ణువుని స్తుతిస్తూ కొన్ని “పాలిండ్రోం” పద్యాలు రాశారు. ఇదిగో ఒక ఉదాహరణ:
(వీటిలో ఏ పాదాన్ని తిప్పి చదివినా మళ్ళీ అదే వస్తుంది)

ధీర శయనీయ శరధీ
మార విభాను మతా మమతా మనుభావి రమా
సారసవన నవసరసా
దారదసమ తారహార తామస దరదా
ఆంగ్లంలో ఒక సరదా ప్రక్రియ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

 

Leave a Reply

%d bloggers like this: