జూలై 15, 2011

స్వాతి సపరివార పత్రిక – కథ కథ కథ కథల పోటీ

Posted in కథల పోటీలు at 10:11 ఉద. by వసుంధర

శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ సత్యప్రసాద్ తెలియజేస్తున్నారు:
స్వాతి సపరివార పత్రిక నిర్చహిస్తున్న – కథ కథ కథ కథల పోటీలో ఈకింద ఇచ్చిన 9 సూక్తులను 9 సబ్జెక్టులుగా చేసుకుని కథలను వ్రాయాలి. ఒక్కరు ఒక్క సబ్జెక్టు పైనే రాయాలన్న నియమం ఏమీ లేదు. ఒకటికి మించి వ్రాయవచ్చు. రాయగలిగితే అన్ని సబ్జెక్టులపైనా రాయొచ్చు.
సూక్తులు ఇవీ:
1. కృషితో నాస్తి దుర్భిక్షమ్
2. అతి సర్వత్ర వర్జయేత్
3. సత్యమేవ జయతే
4. సర్వేంద్రియాణాం నయనం ప్రధానం
5. బాలానాం రోదనం బలం
6. వృద్ధనారీ పతివ్రత
7. విద్వాన్ సర్వత్ర పూజ్యతే
8. బుద్ధి: కర్మానుసారిణి
9. భార్యా రూపవతీ శత్రుః
ఒక్కొక్క కథకు రూ. 9,999 ల బహుమతి. సాధారణ ప్రచురణకు రూ.2,000.
కథ ప్రింటింగ్ లో 3 లేదా 4 పేజీలు రావచ్చు.
కథలు చేరవలసిన ఆఖరు తేది: 3 సెప్టెంబరు 2011
కథలు పంపవలసిన చిరునామా:“కథ కథ కథ కథల పోటీకి”, ఎడిటర్, స్వాతి సపరివార పత్రిక, అనిల్ బిల్డింగ్స్, సూర్యారావు పేట, పోస్ట్ బాక్స్ 339, విజయవాడ – 520 002

మిగతా నియమ నిబంధనలు స్వాతి 22.7.2011 సంచికలో…   

2 వ్యాఖ్యలు »

  1. lalitha said,

    పోటీ విభిన్నంగానూ , ఆసక్తికరంగానూ వుంది

  2. satyam said,

    ఈ పోటీ బాగుందే …!
    ఎంతయినా స్వాతి పద్ధతే వేరు…
    నిత్య నూతనం…


Leave a Reply

%d bloggers like this: