ఆగస్ట్ 30, 2011
అపరాధ పరిశోధన నవలల పోటీ- నది
శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ తెలియజేస్తున్నారు:
నది మాసపత్రిక మరియు శ్రీ జైదుర్గా ఫర్నిషింగ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న అపరాధ పరిశోధన నవలల పోటీప్రచురణకు ఎంపికైన నవలల్లో అగ్రస్థానంలో నిలిచిన రెండు నవలలకుప్రథమ బహుమతి రూ. 30,000/-
ద్వితీయ బహుమతి రూ. 20,000/-
ముఖ్య నిబంధనలు:
నవల నిడివి 200 పేజీలు తగ్గకుండా, 250 పేజీలు మించకుండా ఉండాలి. ఎ4 లేదా ఫుల్ స్కేప్ తెల్లకాగితంపై ఒకవైపు మాత్రమే 25 లైన్లు మించకుండా వ్రాసి పంపాలి.
బహుమతులు పొందిన రచనలు “నది” మాసపత్రిక లేదా “నది వారం వారం” వారపత్రికలో ప్రచురించుకొనే హక్కు అగ్రిగోల్డ్ మల్టీమీడియా సంస్థదే.
అపరాధ పరిశోధన నవల క్రైం, సస్పెన్స్ తో కూడిన టెంపోగల థ్రిల్లర్ నవలై వుండాలి.
కవరుపై “అపరాధ పరిశోధన నవలల పోటీ” అని స్పష్టంగా రాసి ఈ క్రింది అడ్రస్ కు పంపాలి.
మేనేజింగ్ ఎడిటర్, ’నది’ మాసపత్రిక, అగ్రిగోల్డ్ మల్టీమీడియా బిల్డింగ్, 26-20-44, సాంబమూర్తి రోడ్, గాంధీనగర్, విజయవాడ – 520 003
గడువు తేదీ: 31 – 10 – 2011
Leave a Reply