సెప్టెంబర్ 3, 2011
పదహారు వారాల సీరియల్ పోటీ- స్వాతి
స్వాతి సపరివార పత్రికలో 160 పేజీల సీరియల్ కు ఇరవై ఐదువేల రూపాయల నగదు బహుమతి.
మొత్తం 12 సీరియల్స్ ను ఎంపిక చేసి మూడు లక్షల రూపాయల నగదు బహుమతులను అందజేస్తారు.
ముఖ్య నిబంధనలు:
స్క్రిప్ట్ లో పేజీకి సుమారు 200 పదాలు వుండేటట్లు 160 పేజీలు రాయాలి. ఒక పేజిలో రాసే పదాల సంఖ్యను బట్టి స్క్రిప్ట్ లో పేజీలు ఎక్కువ తక్కువ రావచ్చు. అందుకు అభ్యంతరం లేదు. రచన 16 వారాలకు సరిపడా 160 పేజీలు లేకపోయినట్లయితే అది సీరియల్ పోటీకి పరిశీలనార్హం కాదు.
రచయిత(త్రి) పేరు, చిరునామా విడిగా వ్రాతప్రతితో జతపరచాలి. రచన పేరు మాత్రమే నవలపైన వుండాలి.
సీరియల్ పంపే కవరు మీద ’పదహారు వారాల సీరియల్స్ పోటీకి’ అని రాయాలి>
చిరునామా: ఎడిటర్ స్వాతి సపరివార పత్రిక, అనిల్ బిల్డింగ్స్, సూర్యారావు పేట, పోస్ట్ బాక్స్ 339, విజయవాడ 520002
సీరియల్స్ చేరవలసిన ఆఖరు తేది: 31.10.2011
హామీ పత్రం తదితర షరా మామూలే. పూర్తి వివరాలు ఈ వారం (9.9.2011) స్వాతి సపరివార పత్రికలో లభిస్తాయి.
ఈ సమాచారం అందజేసిన శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ కి ధన్యవాదాలు.
Leave a Reply