సెప్టెంబర్ 16, 2011

కవితల పోటీ

Posted in సాహితీ సమాచారం at 6:45 సా. by వసుంధర

అరిపిరాల సత్యప్రసాద్ తెలియజేస్తున్నారు.

అభ్యుదయ కవి కుందుర్తి సంస్మరణలో భాగంగా యువ కవులు, కవయిత్రులను ప్రోత్సహింఛేందుకు ఏ.జి. ఆఫీసు తెలుగు సాహితీ సమితి, రంజని – కుందుర్తి అవార్డు పేరిట జాతీయ స్థాయిలో తెలుగులో వచన కవితల పోటీ నిర్వహిస్తున్నది. అత్యుత్తమ కవితకు 2,500 రూపాయలు, యోగ్యతా పత్రం, ఉత్తమ కవితకు 1,500 రూపాయలు, యోగ్యతా పత్రం, పది మంచి కవితలకు ఒక్కక్క దానికి 300 రూపాయలు, యోగ్యతా పత్రాలు అందజేస్తారు.ప్రధాన కార్యదర్శి, రంజని, తెలుగు సాహితీ సమితి, అకౌంటెంట్ జనరల్ ఆఫీసు, హైదరాబాద్ – 500 004 చిరునామాకు 30-09-2011 లోగా కవితలు అందేలా పంపాలని సమితి అధ్యక్షులు చీకోలు సుందరయ్య, ప్రధాన కార్యదర్శి మట్టిగుంట వెంకట రమణ తెలియజేశారు.

ఈ ప్రకటన నవ్య వార పత్రిక 21-09-2011 సంచికలో 6 వ పేజీలో వచ్చింది.

2 వ్యాఖ్యలు »

  1. tgnanaprasuna said,

    vaariki e.mail pampavachchaa? id cheppagalaraa?


Leave a Reply

%d bloggers like this: