అక్టోబర్ 10, 2011

పాడుతా తీయగా

Posted in బుల్లితెర "కోతికొమ్మచ్చి" at 4:56 సా. by వసుంధర

తెలుగు భాష అందమైనది. శ్రావ్యమైనది. సొగసైనది. మనసైనది. ఆ విషయాన్ని సుష్పష్టం చేసేలా బాసు (ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం) నిర్వహిస్తున్నారు ఈటివిలో పాడుతా తీయగా కార్యక్రమాన్ని.

ఈ కార్యక్రమంలో లేబ్రాయపు  వారి ప్రదర్శన తెలుగు భాషకూ, సంగీతానికీ ఉన్న లాలిత్యానీ, భవితవ్యాన్నీ గొప్పగా సూచించింది. గతంలో వచ్చిన కొన్ని ప్రదర్సనలపై మా వ్యాఖ్యలకోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

ప్రస్తుతం పదహారుకి అటూ ఇటూ లేతప్రాయంలో ఉన్న గొంతుల్లోంచి కొన్ని నెలలుగా (ప్రతి సోమవారం రాఫ్ర్తి 9.30కి) అద్భుత గానం వినిపిస్తోంది ఈ కార్యక్రమం ద్వారా. అందుకు గత రెండు వారాల్లో జరిగిన సెమీ ఫైనల్సుని మచ్చుగా తీసుకోవచ్చు. ఆ చిన్నారుల గాత్ర సౌలభ్యాన్నీ, మాధుర్యాన్నీ విని తీరాల్సిందే! 

ఈ రోజునుంచీ మొదలై కొన్ని వారాలపాటు జరుగనున్న ఫైనల్సు తప్పక చూడగలరు.

1 వ్యాఖ్య »

  1. Y Subba Rao said,

    Shri Balasubrahmanyam is a walking encyclopaedia and his mental web site is universal . His grasping capacity to site a small mistake is a matter of genius. The programme is so fresh and it is hard to miss.


Leave a Reply

%d bloggers like this: