అక్టోబర్ 18, 2011

కవితల సంపుటాల పోటీ

Posted in కథల పోటీలు at 4:32 సా. by వసుంధర

శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ తెలియజేస్తున్నారు
ఈ కింద వున్న వివరాలు సాహితీ కిరణం అక్టోబర్ 2011లో ప్రకటించారు

రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం 2011
రంగినేని సుజాత మోహన్ రావు ఎడ్యుకేషనల్ & చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు తన తల్లి కీ.శే. రంగినేని ఎల్లమ్మగారి పేర రాష్ట్రస్థాయిలో ప్రతి సంవత్సరం ఇచ్చే సాహిత్య పురస్కారం ఎంపిక కోసం 2011 సంవత్సరానికి గాను 2009, 2010, 2011 సంవత్సరాలలో ప్రచురించబడిన కవితా సంపుటాలు 5 ప్రతులను నవంబర్ 07, 2011 వ తేదీలోపు అందేటట్టుగా పంపించాల్సిందిగా కోరుతున్నారు. అవార్డు కింద రూ 11000/- నగదు జ్ఞాపిక, పురస్కార పత్రం అందజేయబడతాయి. రంగినేని ట్రస్టు, సిరిసిల్లలో జనవరి 2012లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ఈ పురస్కారం ప్రదానం చేయబడును.
కవితా సంపుటాలు పంపాల్సిన చిరునామా:
అధ్యక్షులు
రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం – 2011
రంగినేని సుజాత మోహన్‌రావు ఎడ్యుకేషన్ & చారిటబుల్ ట్రస్ట్
బాలాజినగర్, సిరిసిల్ల – 505301, కరీంనగర్ జిల్లా

జి.వి.ఆర్. ఆరాధన రాష్ట్రస్థాయి కవితా సంపుటాల పోటీ (2010-2011)

జి.వి.ఆర్ ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ సాహితీ కిరణం సౌజన్యంతో తొలిసారిగా కవితా సంపుటాల పోటీని నిర్వహిస్తున్నది.
నిబంధనలు
2010-11 లో ప్రచురించబడిన కవితా సంపుటాలను మాత్రమే పంపవలెను.
పోటీలకు పంపదలచిన వారు సాహితీ కిరణం చందాదారులై వుండాలి.
కవితా సంపుటాలు 1/8 సైజు డమ్మి సైజులో (100) పేజీలు తక్కువకాకుండానూ, అందులో 85 పేజీల వరకు ఖచ్చితంగా కవితలతో నిండి వుండాలి.
బహుమతులు హైదరాబాద్ లో జనవరి 2012లో జరిగే కార్యక్రమంలో అందజేయబడతాయి
కవితా సంపుటాలు చేరవలసిన ఆఖరితేది 10-12-2011
కవితా సంపుటాలు 2 ప్రతులను, కవరుపై జి.వి.ఆర్ ఆరాధన రాష్ట్రస్థాయి కవితా సంపుటాల పోటీ – 2010-11 అని రాసి పోస్ట్ లేదా కొరియర్ ద్వారా దిగువ పేర్కొన్న చిరునామాకు పంపవలెను.
మొదటి బహుమతి: రూ. 2000
ద్వితీయ బహుమతి: రూ 1000
చిరునామా:
సంపాదకులు
సాహితీకిరణం మాసపత్రిక
11-13-154, రోడ్ నెం. 3, అలకాపురి కాలనీ,
హైదరాబాద్ – 500 035
సెల్: 9490751681, 9849882783

శ్రీ కిరణ్ సాంస్కృతిక సమాఖ్య 2011 రాష్ట్రస్థాయి కవితల పోటీలు

శ్రీ కిరణ్ సాంస్కృతిక సమాఖ్య 2011 రాష్ట్రస్థాయి కవితల పోటీ నిర్వహించుతున్నది.
బహుమతులు:
మొదటి ఉత్తమ కవిత: రూ 500
రెండొవ ఉత్తమ కవిత: రూ 300
మూడవ ఉత్తమ కవిత: రూ 200
మరో 10 మంది కవులకు కవయితృలకు ఉత్తమ కవితా పురస్కారం.
కవితతో పాటు “శ్రీ కిరణ్ సాంస్కృతిక సమాఖ్య 2011 అవార్డుకు” ప్రత్యేకించి వ్రాసినదనే హామీ పత్రం జతచేయాలి.
కవితా వస్తువు (అంశం) పరిధిలో 20 లైన్లకు మించకుండా సామాజిక స్పృహ కలిగినదై ఉండాలి.
ప్రవేశ రుసుము కింద రూ 100 దిగువ అడ్రసుకు అధ్యక్షుల వారి పేరున ఎం.ఓ. చేయవలెను. ఇది వాపసు ఇవ్వబడదు.
కవితతో పాటుగా 3 జిరాక్సు కాపీలు రెండు పాస్‌పోర్టు సైజు ఫోటోలతో సహా, ఫొటో వెనుక వారి పేరు వ్రాసి వుండవలెను.
చివరి తేది: 30-11-2011
ప్రవేశ రుసుము, కవితలు పంపవలసిన చిరునామా
లంకా వెంకట సుబ్రమణ్యం
అధ్యక్షులు, శ్రీ కిరణ్ సాంస్కృతిక సమాఖ్య
ఫ్లాట్ నెం: 308, శ్రీ మణికంఠ, కళ్యాణ్ నగర్, ఈస్టు ఆనంద్ బాగ్
మల్కాజ్‌గిరి, హైదరాబాద్ – 500 047, సెల్: 94404 48650

Leave a Reply

%d bloggers like this: