అక్టోబర్ 20, 2011

తోడు-నీడ

Posted in సాంఘికం-రాజకీయాలు at 3:54 సా. by వసుంధర

శిశిరంలో వసంతానికై ఎన్.ఎం. రాజేశ్వరి ప్రారంభించిన తోడు-నీడ ఉద్యమం వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి.
అక్టోబర్ 22న ఆమె నిర్వహిస్తున్న సమావేశం ఆహ్వానం, వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి.
ఈ ప్రయత్నంలో సాధక బాధకాలను ఆమె మాటల్లో ఈ కింద చదవండి:      
జీవితమంటేనే కష్టసుఖాల సమాహారము, సుఖాలకి సంతోషించడం, కష్టాలకు కృంగిపోవడం మానవ నైజం. కానీ కష్టాలను ధైర్యంతో ఎదుర్కొని, సమస్యను సానుకూలంగా పరిష్కరించుకొని, జీవితంలోని ఆనందాన్ని ఆస్వాదించవచ్చు, కాని అలాంటివాళ్ళు లోకంలో ఎందరుంటారు?

 వృద్ధాప్యం ఒక శాపం. దానికి ఒంటరి జీవితం తోడైతే? ఆవేదన వర్ణణాతీతం. జీవితమంతా తోడు-నీడగా నిలవాల్సిన జీవిత భాగస్వామి మధ్యలోనే మాయమైతే? ఒంటరి జీవితాన్ని మోయలేక బ్రతుకు భారమై జీవించలేక… మరణించనూలేక, సతమతమవుతున్న తరుణంలో నిన్ను నిన్నుగా ప్రేమించే మనిషి నీకు ఎదురై నేనున్నానంటూ నీకు అండగా నిలబడితే! అంధకార బంధుర ఒంటరి జీవితంలో చిరువెలుగులు నింపగలిగితే! ఈ జీవన సంధ్యలో ఒక తోడు-నీడగా నీ వెన్నంటి ఉంటే ఎంత బాగుంటుంది!!!

 అలా  తోడు కోసం తపించి… తపించి… తపించి… తనను మెచ్చి, తనకు నచ్చిన వ్యక్తి ఎదురైనప్పుడు ఆ స్నేహ హస్తాన్ని అందుకోడానికి వృద్ధాప్యంలో కూడా ధైర్యంగా సమాజాన్నే కాదు, తన కుటుంబాన్ని కూడా ఎదురించి ఒక కొత్త సాంప్రదాయానికి తెర తీసి విజయాన్ని వరించి జీవితాన్ని ఆనందమయం చేసుకున్న కొందరి విజయ గాధల్ని మీకు సగర్వంగా సమర్పిస్తున్నాను.

1. విజయలక్ష్మీ విజయ గాథ:- విజయ లక్ష్మీ (క్రిస్టియన్‌) 60 సం||రాల వయస్సు. నాగేశ్వరరావు (ఎస్‌.సి.) 65 సం||లు. ఇద్దరు కంపానియన్‌ సొసైటిలో కలిసారు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. కలిసి జీవించాలని నిర్ణరుుంచుకున్నారు. విజయలక్ష్మీ క్రిస్టియన్‌ అరుునప్పటికి అతని కోసం గుడికి వచ్చి, గుళ్ళో అతనిని పెళ్ళి చేసుకుంది. పిల్లలు ఒప్పుకోరనే భయంతో ఈ విషయం పిల్లలకు చెప్పలేదు. మరునాడు విషయంల తెలిసిన ఆమె కొడుకు, ఆమెను నాగేశ్వరరావు ఇంటినుండి బలవంతంగా తీసుకెళ్ళి గృహనిర్భంధం చేశాడు. నాగేశ్వరరావు నా దగ్గరకి పరిగెత్తుకొని వచ్చి నా భార్యను నాకు అప్పగించమని కోరాడు. నేను పిల్లలతో మాట్లాడతానని అతని ధైర్యం చెప్పి పంపాను. విజయలక్ష్మీ ఇంటికి వెళ్ళడానికి, నాకు తోడు రావడానికి ఎవరూ ఇష్టపడలేదు, పైగా ఎస్సీ ఎట్రాసిటి కేసు పెడితే, బెరుుల్‌ కూడా దొరకదని, అనవసరంగా చిక్కుల్లో ఇరుక్కోవద్దని నన్ను హెచ్చరించారు. వాళ్ళను పరిచయం చేయడం వరకే సంస్థ బాధ్యత, తరువాత పరిణామాలతో నాకు సంబంధం లేదు కాబట్టి, నన్ను కల్పించుకోవద్దని సలహా ఇచ్చారు. సంస్థ పరంగా బాధ్యత లేకపోరుునా ఈ వివాహం ఫెరుుల్‌ అరుుతే సొసైటీలో ఇది నెగెటివ్‌గా మెసేజ్‌ వెళుతుంది. కాబట్టి దీని పరిష్కారం నా నైతిక బాధ్యత అని భావించి, వారి పిల్లల దగ్గరకు వెళ్ళాను. కంపానియన్‌ సొసైటి మెంబర్‌ ఒక రిటైర్డ్‌ ఆఫీసర్‌ నాకు తోడుగా వచ్చారు. ప్రతి మనిషికి ఏ వయసులో అరుునా తోడు అనేది అవసరమని, ఈ వయసులో వారి తల్లికి సమ వయస్కులైన మానసికమైన తోడు అవసరమని నచ్చచెప్పాను. తల్లిదండ్రులను చూడడమంటే వారికి తిండి, బట్ట పెట్టడం మాత్రమే కాదని, వారి మానసిక ఆనందానికి సహకరించాలని ప్రోత్సహించాను. విజయలక్ష్మీ కొడుకు తన తల్లి చేసిన ఈ పనికి తాను ఆత్మ హత్య చేసుకుంటానని దీనికి కారణమైన వారందరి పేర్లు కాగితం మీద వ్రాసి (నా పేరు కూడా) కమీషనర్‌ గారికి ఇచ్చి కమీషనర్‌ ఆఫీసు ముందే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. నేను భయపడలేదు. తన చావు వలన సమస్య పరిష్కారం కాదని, సమాజానికి ఏమీ నష్టం కలగదని చెప్పాను. పేపర్లు, టి.వి.లలో వార్తను చూసిన ప్రజలు మరునాటికి ఈ విషయం మర్చిపోతారని చెప్పాను. తల్లి ఆనందంగా జీవించడం కావాలో, కళ్ళ ముందు జీవచ్ఛవంలా ఒంటరి బ్రతకు ఈడుస్తూ, క్రుంగి, కృశించి, నశించడం కావాలో, నిర్ణరుుంచుకోమని చెప్పి వచ్చేసాను. కొంత సమయం తీసుకున్నప్పటికి ఇప్పుడు తల్లి, పిల్లలు కలిసారు, నాగేశ్వరరావును కూడా కలుపుకున్నారు. అందరు ఆనందంగా ఉన్నారు. కథ సుఖాంతమైంది.

2. తారా, రామ్మూర్తి గాథ:- తారా, రామ్మూర్తి విజయవాడ మీటింగ్‌లో తామిద్దరం వివాహం చేసుకోబోతున్నామని ప్రకటించారు. ఆయన పిల్లలకు ఈ విషయం చెప్పగానే వీల్లేదని గొడవ చేశాడు. మా ఇంటికి వచ్చి నన్ను బెదిరించారు. నేను భయపడలేదు. ఆయన ఒంటరివాడు కాబట్టి చట్టప్రకారం వివాహం చేసుకునే హక్కు ఆయనకు ఉందని చెప్పాను. 70 ఏళ్ళ వయసులో తోడు లేక ఆయనపడే మానసిక వేదన వివరించాను. ఆయన చాలా ఆస్తి పరుడని, ఆస్తి తమకు పంచలేదని పిల్లలు చెప్పినప్పుడు, నేను రామ్మూర్తిగారికి నచ్చచెప్పి వారి వాటా ఆస్తి వారికి ఇప్పించే ప్రయత్నం చేస్తానని వారికి చెప్పాను. వాళ్ళ అమ్మారుు టి.వి.9కు నా గురించి చెప్తానని బెదిరించింది. నేను చేస్తున్నది చట్ట వ్యతిరేకమైనది, అనైతికమైనది కాదు కాబట్టి, నేను భయపడనని చెప్పాను. త్వరలో వారిద్దరు వివాహం చేసుకోబోతున్నారు.

3. కామేశ్వరి, శంకరయ్య గాథ:- వీరిది మరొక విచిత్ర గాధ. 70 సం||ల శంకరయ్యగారు ఒక రిటైర్డ్‌ హెడ్‌మాస్టర, మద్యతరగతి కుటుంబీకుడు, ఆస్తిపరుడు కాదు, అందగాడు అంతకన్నా కాదు. ఆయనను 55 సం||ల ఉద్యోగిని, కామేశ్వరి ఇష్టపడింది. ఆయనతో సహజీవనం సాగించింది. 3 నెలల తరువాత కామేశ్వరి సోదరుడు, కామేశ్వరికి పెళ్ళి సంబంధం తీసుకువచ్చాడు. అన్ని విధాలా కామేశ్వరికి, ఈడు-జోడు, ఉద్యోగస్థుడు, ఆస్తిపరుడు, ఒకే కులస్థుడు. కామేశ్వరి నన్ను సలహా అడిగింది. తన జీవితానికి నిర్ణయం తానే తీసుకోవాలని, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్పాను. సరైన నిర్ణయానికి నా సహకారం ఎప్పుడూ ఉంటుందని చెప్పాను. నా మనసులో మాత్రం కామేశ్వరి శంకరయ్యను వదిలేసి అన్నగారు చెప్పిన సంబంధం చేసుకుంటుందని అనుకున్నాను. కానీ నా అంచనాలు తలక్రిందులు చేస్తూ, తాను శంకరయ్య గారితోనే కలిసి ఉంటానని, ఒకసారి ఆయన చేరుు పట్టుకున్నాక వదిలే ప్రసక్తి లేదని చెప్పింది. ధైర్యంగా కుటుంబంలో వచ్చే పరిణామాలను ఎదుర్కొనడానికి సిద్ధపడింది. ఆయనకు దూరంగా ఉండలేక ఉద్యోగాన్ని కూడా వదిలి ఆయన దగ్గరకు వచ్చేసింది. ”శంకరయ్య గారు నాకు భగవంతుడిచ్చిన వరం, ఆయనతో నా జీవితం ప్రశాంతంగా ఆనందంగా సాగిపోతుంది” అని కామేశ్వరి హిందూ పేపర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది.

 ఇలా ఒక్కొక్కరివి ఒక్కొక్క గాథ, వారు వారి జీవితాలకు పోరాటం చేస్తున్నారు. నేను వారందరి జీవితాల కోసం ఒంటరి పోరాటం చేస్తున్నాను.

 ప్రతి మనిషికి సమస్య ఉంటుంది, ప్రతి సమస్యకు సరిష్కారం కూడా ఉంటుంది. ఆ దిశగా ధైర్యంగా అడుగు వేయగలిగిన నాడు, తమ సమస్యను పరిష్కరించుకోవడమే కాదు, అటువంటి ఎందరికో మార్గదర్శకులౌతారు.

 ప్రతీ దాంట్లోనూ లాభనష్టాలు రెండూ ఉంటారుు. నష్టాలకు భయపడి ప్రయత్నం మానకూడదు. నష్టాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ జీవితం ముందుకు సాగిపోవాలి. 

4 వ్యాఖ్యలు »

  1. htaneez said,

    maaruthunna ee rojulalo manishi vrudhapyamulo thodu enduku avasaramu ante : manakandarikee chinna kutumbalu unnaayi..okaru leda iddaru pillalatho..chaduvulu chadivinchikuntunnamu.daanitho udyogaalaku dooramu vellavalasi vasthunnadi..aa paristhithullo naannanu vadali ammanu theesukupothunnaru..naannaku pillala .vembadi poyi thana swatantryamu pogottukoleka ontariga undipovalasivasthindi..chhala pedda narakam.. kutumba sabhyula nirlakshyaaniki guri/bali avadamu kante thoduga thana abhipraayaalatho ekeebhavinche vyakthini thoduga korukunte santhoshakaramaina jeevanamu konasaagincha vachchu…


Leave a Reply

%d bloggers like this: