Site icon వసుంధర అక్షరజాలం

యువకథకు ఆహ్వానం

శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ తెలియజేస్తున్నారు
తెలుగు తొలి కథావైతాళికుడు గురజాడ అప్పారావు 150వ జయంతిని పురస్కరించుకొని కడపజిల్లా నందలూరు కథానిలయం యువ రచయితల కథలతో కథా సంపుటాన్ని తెస్తున్నది. ఈ విషయాన్ని కథానిలయం అధ్యక్షులు అబ్బిగారి రాజేంద్రప్రసాద్ తెలియజేస్తున్నారు. యువరచయిత(త్రు)లు రాసిన కథలతోపాటు వారి ఫోటో చిరునామా, సెల్ నెంబర్‌తో వివరంగా అబ్బిగారి రాజేంద్రప్రసాద్, అధ్యక్షులు, నందలూరు కథానిలయం, గురజాడ నగర్, నందలూరు – 516150, కడపజిల్లా అనే చిరునామాకు పంపాలి. ఇతర వివరాలకు సెల్ నెం:9441056159.
రాజేంద్రప్రసాద్‌గారు చెప్పిన వివరం ప్రకారం 40 సంవత్సరాల లోపు వున్న కథకులనుంచి వీరు కథలు ఆశిస్తున్నారు. ఆయా కథకులు తాము వ్రాసి, తమకు నచ్చిన కథలను వారికి పంపితే వాటిలో అర్హమైన కథను ఎన్నుకోని సంపుటిలో జోడిస్తారు. అంతర్జాలం/ఈ-మెయిల్ ద్వారా పంపించే అవకాశం లేని కారణంగా కథలను/జిరాక్స్ కాపీలను పోస్టు ద్వారా పంపవలసిందని వీరు కోరుతున్నారు.

Exit mobile version