అక్టోబర్ 31, 2011

పాడుతా తీయగా

Posted in బుల్లితెర "కోతికొమ్మచ్చి" at 4:32 సా. by వసుంధర

తెలుగు భాష అందమైనది. శ్రావ్యమైనది. సొగసైనది. మనసైనది. ఆ విషయాన్ని సుష్పష్టం చేసేలా బాసు (ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం) నిర్వహిస్తున్నారు ఈటివిలో పాడుతా తీయగా కార్యక్రమాన్ని.

ప్రస్తుతం పదహారుకి అటూ ఇటూ లేతప్రాయంలో ఉన్న గొంతుల్లోంచి కొన్ని నెలలుగా (ప్రతి సోమవారం రాత్రి 9.30కి) అద్భుత గానం వినిపిస్తోంది. వారి ప్రదర్శన తెలుగు భాషకూ, సంగీతానికీ ఉన్న లాలిత్యానీ, భవితవ్యాన్నీ గొప్పగా సూచిస్తోంది. అక్టోబర్ 17నుంచి ఈ కార్యక్రమం ఉత్ఫ్కంఠభరితమైన అంతిమ ఘట్టానికి చేరుకుంది.

ఈ రాత్రి కూడా మీరా ఆ చిన్నారుల గాత్ర సౌలభ్యాన్నీ, మాధుర్యాన్నీ విని తీరాల్సిందే!

ఈ క్రింది లంకెలు మీ సౌలభ్యానికి:

గతంలో వచ్చిన అక్షరజాలం వ్యాఖ్యలు                     పాత ప్రదర్శనలు                     ఫైనల్స్ అక్టొబర్ 17                              ఫైనల్స్ అక్టొబర్ 24

6 వ్యాఖ్యలు »

  1. శివకుమార శర్మ said,

    క్రికెట్ ఆడేవాళ్ళందరూ తెండూల్కర్ అంతటివారు కాలేరని నిరాశచెంది క్రికెట్ బాటే ముట్టుకోవద్దని పిల్లలకి చెప్పరు. ఐఐటి పరీక్షకి లక్షలమంది ఎన్నేళ్ళో కష్టపడినా ప్రతి సంవత్సరం కొన్ని వేలమంది మాత్రమే ఎంపిక అవుతారని తెలిసికూడా తల్లిదండ్రులు పిల్లల ట్యూషన్లకోసం వేలరూపాయల్ని ఎల్కెజీనుంచే కుమ్మరించడం మానరు. అలాగని వరంగల్ ఇంజనీరింగ్ కాలేజీ నుంచేకాక నిన్నమొన్న పెట్టిన ఇంజనీరింగ్ కాలేజీనుంచీ డిగ్రీ చేపట్టిన వాళ్లని కూడా ఇంజనీర్లని అనకుండానూ వుండరు. మనసుకు ఆహ్లాదమిచ్చే లలితకళలకి మాత్రమే, సుశీల అంతటివారో ఎస్పీ బాలూ వంటివారో కాలేకపోతే గళాన్నెత్తకూడదనీ, బాపూ అంతటివారు కాలేకపోతే కుంచె పట్టుకోకకూడదనీ ఆంక్షలు! కోటివిద్యలు కూటికొరకే అన్న సామెతని అందించిన వాళ్లెవరోగానీ వాళ్లు మనసుని ఎక్కడో వదిలేసినవాళ్లు. మ్రొక్కినవరమీని వేల్పుని వదిలెయ్యమన్నవాళ్లు అన్నంపెట్టని అమ్మని కూడా వదిలెయ్ అనేవాళ్లు కాగలరు. ఆదాయాన్ని సమకూర్చని విద్య నిరర్ధకం అనేవాళ్లు ఆలోచించవలసిన విషయం – డబ్బే ప్రధానమనుకున్నాగానీ యండమూరి వీరేంద్రనాధ్ గారికి కోట్లు గడించిపెట్టిన ప్రతిభని ఆయనకి ఏ కాలేజీలో నేర్పారు అన్న విషయాన్ని. తెలుగు వ్రాయడం, చదవడంకూడా నిరర్ధకమనుకునేవాళ్లకిగానీ, లలితకళలు సమయాన్ని వృధాచేస్తాయని అనుకునేవాళ్లకిగానీ ఎస్పీబీగారు ఇంజనీరింగ్‌చదువుని మధ్యలో ఆపేశారనీ, సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు మెడిసిన్ చదవడం మధ్యలో వదిలేశారనీ సంగీతకళానిధి డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారు మెడికల్ డాక్టరనీ, వయొలిన్‌లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎల్ సుబ్రమణ్యం గారు ఆయన తమ్ముడు ఎల్ శంకర్ ఇద్దరూ కూడా మెడికల్ డాక్టర్లేననిగానీ, మాజీ ప్రధానమంత్రి కీ.శే. పి.వి.నరసింహారావుగారు పదమూడు భాషల్లో కోవిదులనీ ఎప్పుడు తెలుస్తుందో, ఏమో! మనవాళ్లగూర్చి ఇలాంటి వివరాలు తెలియకపోయినా కనీసం ఈమధ్యనే స్వర్గస్థులైన స్టీవ్ జాబ్స్ కూడా కాలేజీ డ్రాపవుట్ అనీ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కూడా కాలేజీ డ్రాపవుట్ అనీ తెలిసేవుండాలి. “పాడుతా తీయగా” పిల్లల ప్రతిభల దివ్వెలని ప్రపంచం నలుమూలలా వెదజల్లడానికి తోడ్పడుతోంది. ఆ ప్రతిభని మనసారా ఆనందిస్తూ అభినందిస్తూ ఆశీర్వదించే బాలుగారు ఈ కార్యక్రమానికి రథసారథవడం అన్నితరాల ప్రేక్షకుల అదృష్టం. అమెరికన్ ఐడల్లో కూడా ఇంత ప్రతిభావంతుణ్ణి రథసారథిగా ఇప్పటిదాకా ఎవరూ చూసివుండరు.

  2. లక్ష్మీ రాధిక said,

    శ్యామలరావుగారు,
    సాధారణంగా ఎక్స్ట్రా కురిక్యులర్ యాక్టివిటీస్ లో రాణించే చిన్నారులు చదువులోనూ ముందే వుంటారు. కళల ముఖ్య వుద్దెశ్యం మనసును రంజింపచేసుకోవడమే. ముఖ్యంగా పాడుతా తీయగా లో పాడుతున్న చిన్నారులు సినిమాలో పాడడమే పరమావధిగా చదువును నిర్లక్ష్యం చేస్తూ వున్నట్లు కనిపించదు. వసుంధర గారు పైన వుటంకించినట్లు మనమూ వారంలో ఒక రోజు ఒక గంట పాటు చక్కటి సంగీతాన్ని ఆస్వాదించడమే మనము చేయవలసిన పని


Leave a Reply

%d bloggers like this: