అక్టోబర్ 31, 2011

పాడుతా తీయగా

Posted in బుల్లితెర "కోతికొమ్మచ్చి" at 4:32 సా. by వసుంధర

తెలుగు భాష అందమైనది. శ్రావ్యమైనది. సొగసైనది. మనసైనది. ఆ విషయాన్ని సుష్పష్టం చేసేలా బాసు (ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం) నిర్వహిస్తున్నారు ఈటివిలో పాడుతా తీయగా కార్యక్రమాన్ని.

ప్రస్తుతం పదహారుకి అటూ ఇటూ లేతప్రాయంలో ఉన్న గొంతుల్లోంచి కొన్ని నెలలుగా (ప్రతి సోమవారం రాత్రి 9.30కి) అద్భుత గానం వినిపిస్తోంది. వారి ప్రదర్శన తెలుగు భాషకూ, సంగీతానికీ ఉన్న లాలిత్యానీ, భవితవ్యాన్నీ గొప్పగా సూచిస్తోంది. అక్టోబర్ 17నుంచి ఈ కార్యక్రమం ఉత్ఫ్కంఠభరితమైన అంతిమ ఘట్టానికి చేరుకుంది.

ఈ రాత్రి కూడా మీరా ఆ చిన్నారుల గాత్ర సౌలభ్యాన్నీ, మాధుర్యాన్నీ విని తీరాల్సిందే!

ఈ క్రింది లంకెలు మీ సౌలభ్యానికి:

గతంలో వచ్చిన అక్షరజాలం వ్యాఖ్యలు                     పాత ప్రదర్శనలు                     ఫైనల్స్ అక్టొబర్ 17                              ఫైనల్స్ అక్టొబర్ 24

6 వ్యాఖ్యలు »

 1. lakshmi radhika said,

  I could not see the finals on 31.10.11 Is it available on You Tube. I shall be grateful if I can have the links

 2. తాడిగడప శ్యామలరావు said,

  ‘పాడుతా తీయగా’ కాని, అటువంటి యితర కార్యక్రమాలు గాని, చిన్నపిల్లలకు లేదా యువ గాయకులకు అదృష్టపరీక్షా వేదికలుగా ఆశలు రేపుతుంటాయి. పేరు తెచ్చుకుంటే సినిమాలలో పాడే అవకాశం స్వంతమౌతుందన్న భ్రమలో వాళ్ళంతా చదువులను యితర కార్యకలాపాలను కట్టిపెట్టి భివిష్యత్తును పణం చేసి నెలలపాటు వీటిలో శ్రమిస్తుంటారు. చివరికి జరిగేదేమిటి? బహుమతులు సరే. మన తెలుగు సినిమాలలో వీళ్ళకు దొరికే భవిష్యత్తు ప్రశ్నార్ధకం. మన తెలుగు సినిమాలలో యధావిధిగా తెలుగు చదువను పలకనూ రాని పరభాషా గాయకులు కర్ణశూలాయమానమైన గొంతుకలతో దర్జాగా పాడుతూనే ఉంటారు. అటువంటప్పుడు యెందుకు వీళ్ళతో యిలా ఆడుకోవటం చెప్పండి?

  • మీ అనుమానం సబబైనదే. మనముందు మంచిచెడ్డల మేలు కలయిక ఉన్నప్పుడు వీలైనంత మంచిని గ్రహించి వీలైనంత చెడ్డని దూరంగా పెట్టదంలోనే వ్యక్తిత్వ వికాసం ఉంటుందని పెద్దలంటారు. ఈ సందర్భంలో పాడుతా తీయగా కార్యక్రమాన్ని పరిశీలిస్తే-….
   ప్రతిభ ఉన్నవారికి వేదిక కావాలి. సినిమా అవకాశాలు వచ్చినా రాకపోయినా తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించే అవకాశం పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా ఎందరో ఔత్సాహిక గాయనీ గాయకులకు లభిస్తున్నది. దానిని సక్రమంగా ఉపయోగించుకునే విజ్ఞతను పోటీలో పాల్గొనువారు పెంపొందించుకోవాలి. ఈ కార్యక్రమాన్ని ఒక రంజీ స్థాయి క్రికెట్ పోటీ అనుకోండి. ఈ వేదిక ప్రయోజనకరమే అనిపిస్తుంది. బుల్లితెరపై జరిగే ఇలాంటి మిగతా పోటీలతో పోల్చితే- పాడుతా తీయగా లో ఓటమికి ఘొల్లుమనేవారు తక్కువ. ఇక సమయం వృథా అంటారా- సెల్ ఫోన్లు, సినిమాలు, టివి కార్యక్రమాలు, పబ్సు వగైరాలలో దూబరా అయ్యే సమయంకంటే ఇది ఆరోగ్యకరం. పాటలపై ఆసక్తి ఉన్నవారికిది మంచి అవకాశమని స్వాభిప్రాయం. ఈ కార్యక్రమం గురించిన విశ్లేషణ త్వరలోనే అక్షరజాలంలో చూడగలరు.


Leave a Reply

%d bloggers like this: