నవంబర్ 2, 2011
మిథునం
తెలుగు కథకి కలికితురాయి శ్రీరమణ విరచిత మిథునం. కథకుల్ని పాఠకులుగా, చిత్రకారుల్ని కంపోజిటర్లుగా మలచిన ఘనత ఆ రచనది. సంచలనమైన ఆ ఒకేఒక్క కథని సంకలనంగా తీసుకురావాలన్న ఆలోచన కొత్తది, గొప్పది. రచన శాయి ఆ పని చేశారు. దానికి బాపు బొమ్మల్నీ, అక్షరాల్నీ ఇస్తే- శ్రీరమణ, వసుంధర, జంపాల చౌదరి ముందుమాటలు చెప్పారు. సాహితీ ప్రియులు కానుకగా ఇవ్వడానికీ, పొందడానికీ ఇష్టపడే పుస్తకమిది. పది పుస్తకాలు కొంటే అన్నీ కలిపి మూడు వందల రూపాయలే! పదింటిని ఏం చేసుకుంటామంటారా- ఈ క్రింది ప్రకటన చదవండి.
Leave a Reply