నవంబర్ 6, 2011

పాడుతా తీయగా అక్టోబర్ 31, 2011

Posted in బుల్లితెర "కోతికొమ్మచ్చి" at 4:28 సా. by వసుంధర

ఈ కార్యక్రమం ఈ అక్టోబర్ 31న జయప్రదంగా ముగిసింది. దీనిపై మాకు తోచిన భావాలివి
1. మొదటిసారిగా పాల్గొనేవారి ఎంపిక అద్భుతం అనిపించింది. చిన్న పిల్లలు బాల గాన గంధర్వులై అలరించారు. ప్రథమ బహుమతి ఒక్కరికే దక్కినా, న్యాయనిర్ణయం గొప్పగా ఉన్నదనిపించినా- సుమారు పదిమంది పోటీదార్లు సమ ఉజ్జీలు అనదగ్గవారు. వారికి అభివందనాలు.
2. ఈ పోటీని ఇంత మనోహరంగా నిర్వహించిన బాసుకి అభివందనాలు.
3. ఓడినవారి ఏడ్పులకు, వెక్కిళ్లకు ప్రాధాన్యమివ్వకుండా ఓటమిని హుందాగా స్వీకరించడానికి పోటీదారులకిచ్చిన శిక్షణ మెచ్చుకోతగ్గది.
4. ముఖ్య అతిథిగా వచ్చినవారు ఈ కార్యక్రమాన్ని బాసు అభినందన సభగా మార్చి బోరు కొట్టిస్తున్నారు. కార్యక్రమాన్ని నిర్వహించేవారికి సన్మానాలు, పొగడ్తలు కార్యక్రమంలో హుందాతనాన్ని కొంత హరించి వేశాయి.
5. గాయకులు ఎంత బాగా పాడినా వారిచేత అదేపనిగా పాడించడంవల్ల- ఇది పోటీలా కాక కచేరీలా మారింది. కచేరీ మురిపించిందంటే అది వేరే సంగతి.
6. పాత పాటలు గొప్పవే. అలనాటి సాహిత్యమూ గొప్పదే. ఐతే కాలప్రవాహంలో అభిరుచులు మారతాయి. సినీరంగంలో మరీను. ఆ మేరకు కొత్త అభిరుచుల్ని అవగాహన చేసుకోవడం అవసరం. ఈ విషయం దృష్టిలో ఉంచుకుంటే ఈ కార్యక్రమం- భాష, ఉచ్చారణ దోషాల పట్ల తీసుకుంటున్న శ్రద్ధ, ఇస్తున్న శిక్షణ అభినందనీయం. 
7. ఏది ఏమైనా ఈ కార్యక్రమం అసాధారణం. ఇంకా ఇంకా కొనసాగాలి. నవంబర్ 7న మొదలు కానున్న కొత్త సంచికకోసం సంగీత ప్రియులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
ఫైనల్సుకి లంకెలు  
1                                 2                             3                             4                                      5                                        6                                     7         

Leave a Reply

%d bloggers like this: