నవంబర్ 16, 2011

పొద్దు పిలుపు

Posted in సాహితీ సమాచారం at 4:36 సా. by వసుంధర

సాహితీప్రియులకు పసందుగా, సాహితీపరులకు వీనుల విందుగా వినిపిస్తున్న పొద్దు పిలుపును ఈ క్రింద పొందుపరుస్తున్నాం.  ఈ పిలుపును మనదాకా తీసుకొచ్చిన శ్రీ అరిపిరాల సత్యప్రసాద్‌కి ధన్యవాదాలు అర్పిస్తూ-

ప్రియమైన రచయితలు, రచయిత్రులకు

నమస్కారం!

పొద్దు అంతర్జాల పత్రికకు మీ రచనలు పంపి పత్రిక అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డారు. పొద్దు ప్రస్థానంలో మీ పాత్ర మరువరానిది.

సాధారణ ప్రచురణలతో పాటు, పోటీలు కూడా పొద్దు నిర్వహిస్తూంటుంది. ఈ విషయాన్ని మీరు గమనించే ఉంటారు.

ప్రస్తుతం “కథ చెబుతారా?” పేరిట ఒక కొత్త విశేషాన్ని ప్రవేశపెట్టాం. ముగింపుగానీ, పాత్రల గురించి గానీ, ఒక సంఘటన గానీ ఇచ్చి కథ రాయమని అడుగుతాం. అందుకు అనుగుణంగా కథ రాయడమే ఇందులోని విశేషం.
నవంబరు నెలకు చెందిన సమస్యను ప్రకటించాం.

“కథ చెబుతారా?” శీర్షికకు సంబంధించిన మరిన్ని విశేషాలను పొద్దులో చూడండి. మీరూ పాల్గొనండి.

మీ రచనలకు స్వాగతం పలుకుతూ..

పొద్దు సంపాదకుడు

2 వ్యాఖ్యలు »

  1. sharada said,

    ఎవరైనా
    మహిమన్ వాగనుశాసనుడు ……….. అని మొదలయిన పద్యానికి పూర్తి పాదాలు ఇవ్వగలుగుతారా?

    • మీరడిగిన పద్యం ‘మహి మున్ వాగనుశాసనుండు’ అయుండాలి అనుకుంటున్నాం. ఇక్కడ క్లిక్ చెయ్యండి.


Leave a Reply

%d bloggers like this: