నవంబర్ 25, 2011

వసుచరిత్ర వైశిష్ట్యం

Posted in భాషానందం at 4:43 సా. by వసుంధర

ఇటీవల శారద అక్షరజాలంలో మహిమన్ వాగనుశాసనుడు అనే పద్యం పూర్తి పాదాలు కావాలని అడిగారు. దానికి సమాధానంగా డా. జొన్నలగడ్డ మార్కండేయులు ఈ క్రింది పద్యం పంపారు.

మహి మున్వాగనుశాసనుండు సృజియింపం గుండలీంద్రుండు ద

న్మహనీయస్థితి మూలమై నిలువ శ్రీనాథుండు ప్రోవన్మహా

మహులై సోముడు భాస్కరుండు వెలయింపన్‌ సొంపు వాటిల్లు నీ

బహుళాంధ్రోక్తిమయ ప్రపంచమున దత్ప్రాగల్భ్య మూహించెదన్‌

ఈ పద్యం రామరాజభూషణుని వసుచరిత్ర లోనిది. తెలుగున పంచకావ్యాల్లో ఒకటిగా పరిగణించబడే ఆ ప్రబంధ కావ్యం విశిష్టతను ఇప్పటికీ ఎందరో సాహితీవిమర్శకులు ప్రస్తావిస్తూనే ఉన్నారు. ఆ చర్చల్తో అంతర్జాలం కూడా సుసంపన్నమైంది.   
చిన్న కుతూహలంతో విలువైన సమాచార సేకరణకు పురిగొల్పిన శారదకు, అడిగిన వెంటనే పద్యాన్ని పంపిన మార్కండేయులుకి ధన్యవాదాలు.

1 వ్యాఖ్య »

  1. sharada said,

    శ్రీ జొన్నలగడ్డ మార్కేండేయులు గారికి వసుంధరగారికి అనేక కృతఙతలు. నేను కోరుకున్న పద్యం కూడా ఇదే. పొరపాటున మహి మున్ బదులు మహిమన్ అని వెతికేటప్పటికి నాకు సరైన పద్యం దొరక లేదు. ఆంధ్ర భాషా ప్రాశస్త్యం తెలిపే ఈ పద్యం, 1960 లలో మా తెలుగు ఉపాధ్యాయులు శ్రీ కోటంరాజు నాగేశ్వర శర్మగారు ప్రతిరోజూ తరగతిలో చదివించేవారు. పాత స్నేహితులము కలిసినప్పుడు ఈ పద్యం పూర్తిగా గుర్తురాక తంటాలు పడ్డాము. ఎంతొ ప్రయాస కోర్చి పూరించిన మార్కండేయులుగారికి, ప్రచురించిన వసుంధరగారికి ఎంతో ధన్యవాదాలు.
    శారద


Leave a Reply

%d bloggers like this: