నవంబర్ 28, 2011

ఎదురీత- కొత్త డెయిలీ సీరియల్

Posted in టీవీ సీరియల్స్ at 12:10 సా. by వసుంధర

అర్థవంతమైన కథ, కథనం. వినోదాత్మకం, ప్రయోజనాత్మకం. ఇదీ తెలుగు టివి సీరియల్స్‌కి ప్రముఖ నిర్మాణసంస్థ జస్ట్ యెల్లో ముద్ర.
అమృతం, రాధ-మధు, అమ్మమ్మ డాట్‌కామ్- వారి మెచ్చుతునకలు.
ఇటీవల తొలుత జెమినిలో వచ్చి అర్థాంతరంగా ముగిసిన వారి అడగక ఇచ్చిన మనసు మాటివిలో పున:ప్రారంభమైనా తిరిగి అర్థాంతరంగానే ముగియడం మంచి సీరియల్స్ కోసం తపిస్తున్న ప్రేక్షకులకు చిరు విషాదం.
మాటివిలో ఈ అక్టోబర్ 31న మొదలైన ఎదురీత సీరియల్ అన్నివిధాలా అభినందించతగ్గ గొప్ప కొత్త ప్రయత్నం. గుణ్ణం గంగరాజు కథకి వాసు ఇంటూరి దర్శకత్వం వన్నెలు దిద్దితే నటీనటులు ప్రాణం పోస్తున్నారు. చంద్రశేఖర్ ఆజాద్ మాటలు అత్యంత సహజంగా మనోహరంగా అర్థవంతంగా కొనసాగుతున్నాయి. అవసరమైన మేరకు పట్నం వెడుతూనే గ్రామీణ వాతావరణానికి పట్టం కడుతున్న ఈ సీరియల్ తెలుగుతనానికీ తెలుగువారికీ గర్వకారణం.
పాత్రానుగుణంగా నటీనటుల్ని ఎంపిక చెయ్యడంలో జస్ట్ యెల్లో ప్రత్యేకతను రాధ-మధు లో మౌనిక, శివపార్వతి చెప్పకనే చెబుతారు. ఈ సీరియల్ లోనూ ప్రతిఒక్కరూ తమతమ పాత్రల్లో ఇమిడిపోయారు. ఐతే అతి క్లిష్టమైన పాత్రని అవలీలగా పోషిస్తూ ప్రేక్షకుల మనసు దోచుకుంటున్న వీణ పాత్రధారిణి మరింత ప్రత్యేకం.
ప్రతివారం సోమ-శుక్రవారాల్లో రాత్రి 8.30-9 మధ్య వచ్చే ఈ సీరియల్ ప్రతి ఒక్కరూ తప్పక చూడతగ్గది.
మొదట్నించీ ఈ సీరియల్ చూడాలనుకునేవారు ఇక్కడ క్లిక్ చెయ్యండి.          

Leave a Reply

%d bloggers like this: