నవంబర్ 28, 2011

నవలల పోటీ ఫలితాలు- ఆంధ్రభూమి

Posted in కథల పోటీలు at 11:37 ఉద. by వసుంధర

ఆంధ్రభూమి దినపత్రిక  నవలల పోటీ ప్రకటించింది కదా- ఆ ఫలితాలు ఇటీవలే ప్రకటించారు. పోటీ గురించి వారి మాటలివి:  
ఆంధ్రభూమి దినపత్రిక నిర్వహించిన నవలల పోటీకి రచయితల స్పందన బాగా ఉంది. ఎందరో ప్రసిద్ధ రచయితలు, వర్ధమాన రచయితలు పోటీలో పాల్గొని, ఆంధ్రభూమి ప్రయత్నానికి సహకరించారు. అందరికీ ధన్యవాదాలు.
పోటీకి అందిన నవలలు సంఖ్యాపరంగా చూస్తే ఇటీవలి సంవత్సరాల పోటీలకు వచ్చిన వాటికంటే ఎక్కువ కావడం సంతోషమే. కాని రాశిని చూస్తే కలిగిన ఆనందం వాసిపరంగా కలగలేదని చెప్పక తప్పదు.

అన్ని అంశాలు సాకల్యంగా పరిశీలించినమీదట ఫలితాలను ఇలా నిర్ణయించాము:

మొదటి బహుమతి : రూ. 50,000 : లేదు

రెండవ బహుమతి (2): రూ. 25,000

1. ముళ్లగులాబి   -ఎస్.ప్రవీణారెడ్డి

2. నా నువ్వు.. నీ నేను!  -బొమ్మదేవర నాగకుమారి

ప్రత్యేక బహుమతి: రూ. 20,000

అన్వేషణ  -గంటి భానుమతి

మొదటి బహుమతి ఇవ్వటంలేదు కనుక ఆ మొత్తాన్ని మిగతా బహుమతులకు పంచాం.
ఈసారి అన్ని బహుమతులు మహిళలే గెలుచుకోవటం విశేషం. విజేతలకు అభినందనలు. బహుమతి మొత్తాలు త్వరలో పంపుతాము.
సాధారణ ప్రచురణకు స్వీకరించిన నవలల జాబితా కింద ఇస్తున్నాం. వీటిని ఆంధ్రభూమి దిన, వార, మాస పత్రికలలో వీలు వెంబడి ప్రచురిస్తాం. మిగిలిన వాటిని (తగిన స్టాంపులతో తిరుగు కవరు పంపించిన) రచయితలకు తిప్పి పంపుతున్నాం. బహుమతి పొందిన నవలల ప్రచురణ వీలైనంత
త్వరలో ప్రారంభిస్తున్నాం.
సాధారణ ప్రచురణకు స్వీకరించిన నవలలు
1.జాబిల్లి కోసం – ఎస్.లక్ష్మిరెడ్డి
2.నకిలీ మనుషులు – డి.విజయలక్ష్మి (వింధ్యవాసిని)
3.ఏ నావది ఏ తీరమో – శైలజామిత్ర
4.విచిత్ర బంధం – పొత్తూరి విజయలక్ష్మి
5.ఎక్కడుంది న్యాయం – సర్వజిత్
6.ఆచార్య దేవోభవ – పి.వి.రమణారావు
7.నాయకురాలు – ప్రఫుల్లచంద్ర
8.కిరణ్మయి కల – డప్పు రాఘవేంద్రరావు
9.జీవన మాధుర్యం – వాలి హిరణ్మరుూదేవి
10. మాతృదేవోభవ – ఆర్.ఎస్.హైమావతి
గమనిక: ఈ నవలలను పైన పేర్కొన్న వరసలోనే ప్రచురించాలన్న నియమం లేదు. ఎప్పుడు ప్రచురించాలన్న దానికీ కాలపరిమితి లేదు.

లంకె పంపిన శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ కి ధన్యవాదాలు.

 

 

Leave a Reply

%d bloggers like this: