నవంబర్ 28, 2011

పాడుతా తీయగా

Posted in పాడుతా తీయగా at 12:31 సా. by వసుంధర

బాసు ఆధ్వర్యంలో నవంబర్ 7న మరో కొత్త పొటీ మొదలైంది. ఇందులో పాల్గొనే గాయనీగాయకుల వయోపరిమితి 18-24. రెండు వారాలపాటు కొంతమందిచేత చకచకా పాటలు పాడించి- 36మందిని ఎంపిక చేసారు. ఈ ప్రాథమిక దశలో పాల్గొన్నవారి ప్రావీణ్యం అంతంతమాత్రం అనిపించి కొంత నిరుత్సాహం కలిగింది. ఐతే నవంబర్ 21న అసలు పోటీ మొదలు కాగానే ఆ నిరుత్సాహం ఉత్సాహంగా మారిపోయింది. ఎంపికైన 36మందినీ నాలుగు భాగాలుగా విభజించారు. ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ కార్యక్రమంలో చక్కని పాటలతోపాటు ఆసక్తికరమైన ఎన్నో విశేషాలు కూడా తెలిసాయి. వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి. ఆ లంకెననుసరించి ఇతర లంకెలు ఉంటాయి.

Leave a Reply

%d bloggers like this: