డిసెంబర్ 1, 2011

ఉగాది కథల పోటీ- నవ్య

Posted in కథల పోటీలు at 8:17 ఉద. by వసుంధర

కరి సీతారామయ్య స్మృతి సాహితి – నవ్య వీక్లీ సంయుక్త నిర్వహణలో ఉగాది కథల పోటీ
ప్రథమ బహుమతి: రూ. 10,000
ద్వితీయ బహుమతి: రూ. 8,000
2 తృతీయ బహుమతులు (కథ ఒక్కింటికి): రూ. 5,000
11 విశేష బహుమతులు (కథ ఒక్కింటికి): రూ. 2,000
కథ తెలుగువారి జీవితానికి అద్దం పట్టేలా ఉండాలి
ప్రపంచంలో ఏ ప్రాంతమైనా కథకు నేపథ్యం కావచ్చు. అయితే అది తెలుగువారి జీవితానికి సంబంధించినదై ఉండాలి.
కథ అరఠావు సైజులో 10 పేజీలకు మించకుండా ఒకవైపునే రాసి పంపాలి. దస్తూరి చక్కగా అర్థమయ్యేలా వుండాలి. డి.టి.పి. చేసిన పక్షంలో అది 6 పేజీలకు మించకూడదు.
కథ పంపేటప్పుడు రచయిత/రచయిత్రి పేరు అందులో ఉండరాదు. పేరు, పూర్తి చిరునామా వేరే కాగితం మీద రాసి జత పరచాలి. హామీ పత్రం విధిగా జత చేయాలి. కవరు మీద “నవ్య వీక్లీ ఉగాది కథల పోటీకి” అని స్పష్టంగా పేర్కొనాలి.
కథలు చేరవలసిన ఆఖరు తేది: 18 ఫిబ్రవరి 2012
కథలు పంపవలసిన చిరునామా: నవ్య వీక్లీ
అంధ్రజ్యోతి బిల్డింగ్స్
ఫ్లాట్ నెం. 76, రోడ్ నెం. 70
అశ్వనీ లే అవుట్, హుడా హైట్స్
జూబ్లీ హిల్స్, హైదరాబాద్ – 500 033
ఈ సమాచారం అందజేసిన శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ కి ధన్యవాదాలు   

2 వ్యాఖ్యలు »

  1. ఆఖరుతేదీ 2013 కాదండోయ్.. 2012. పొరపాటుకు క్షంతవ్యూణ్ణి.

    • పొరపాటు మాది కూడా. తేదీని సవరించాం. మీ తక్షణ స్పందనకు ధన్యవాదాలు.


Leave a Reply

%d bloggers like this: