జనవరి 1, 2012
శుభాకాంక్షలు
జాతి నేతలారా! ఒకరినొకరు నిందించడానికి సిగ్గుపడండి. ప్రపంచం ముందు సిగ్గుపడేలా అసహాయులైన అసంఖ్యాక పౌరుల అభ్యున్నతికోసం జాతి గర్వపడేలా చేయీ చేయీ కలపండి.
భాగ్యవంతులారా! మీ సంపదనూ, వైభోగాన్నీ ప్రదర్శించడానికి సిగ్గుపడండి. సాటిపౌరుల్ని అన్నదమ్ములుగా, అక్కచెల్లెళ్లుగా చెప్పుకునేందుకు సిగ్గుపడని విధంగా రూపొందించంది.
మాధ్యములారా! సచిన్ నూరవ శతకం, ఐశ్వర్య మొదటి పురుడు, రామ్ చరణ్ నిశ్చితార్థం వగైరాలను పక్కకు నెట్టండి. అన్నా హజారే పొరపాట్లనీ, తొందరపాటునీ భూతద్దంలో చూపకండి. ధరల పెరుగుదల, రైతుల ఆత్మహత్యలు, అవినీతి వగైరాలు తొలగేదాకా జాతికి వినోదార్హత లేదని నొక్కి చెప్పండి. 64 సంవత్సరాల నిదానం చాలు- సామాన్యుల ఇక్కట్లు తొలగించడానికి తొందరపడాల్సిన అగత్యం వచ్చిందని నేతల్ని ప్రబోధించండి.
పౌరులారా! స్వార్థాన్నీ, అమాయకత్వాన్నీ, మూర్ఖత్వాన్నీ, అవకాశవాదాన్నీ వదిలి సాటి పౌరుణ్ణి ప్రేమించండి. చేయీ చేయీ భుజం భుజం కలిపి ముందడుగు వేస్తే- మిమ్మల్ని తప్పు దారి పట్టించి కోట్లు కూడబెడుతున్న నాయకులు మీ వెనక్కి వచ్చి మీ దారిలో నడుస్తారు. ప్రజాస్వామ్యంలో-నేతలు కారు, మీరే భారత భాగ్యవిధాతలు!
మీ అందరికీ అక్షరజాలం నూతన సంవత్సర శుభాకాంక్షలు!
lakshmi raghava said,
జనవరి 4, 2012 at 12:10 సా.
vasundharaగారూ ,
నూతన సంవత్చర శుభాకాంక్షలు.
మీ మాటలు చాలా స్పుర్తినిచ్చాయి అందరూమీరు చెప్పిన భారత భాగ్య విధతలుగా ఆలోచించాలి. మార్పు వస్తుంది తప్పకుండా
లక్ష్మీ రాఘవ
Suryanarayana Vulimiri said,
జనవరి 1, 2012 at 1:03 సా.
జాలంలో మీ అక్షరాలు అక్షర సత్యాలు వసుంధర అక్షర జాలం గారు. చాల బాగుంది మీ విశ్లేషణ. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.