జనవరి 24, 2012

కపాలదుర్గం- పుస్తకావిష్కరణ

Posted in పుస్తకాలు at 11:59 ఉద. by వసుంధర

చందమామ అభిమానులకు నమస్కారం.

52 సం: పాటు చందమామ సంపాదక మండలిలో పనిచేసి
తోకచుక్క, మకరదేవత, ముగ్గురు మాంత్రికులు, కంచుకోట, జ్వాలాద్వీపం,  రాకాసిలోయ, పాతాళ దుర్గం, శిథిలాలయం, రాతి రథం, యక్షపర్వతం, మాయ సరోవరం, భల్లూక మాంత్రికుడు, మృత్యులోయ, శిథిలనగరం, మంత్రాల దీవి, గంధర్వ నగరం, సర్పకన్య, కపాల దుర్గం

మొదలైన  జానపద సీరియల్స్  ద్వారా  చందమామ, బొమ్మరిల్లులో-  ఆబాల గోపాలాన్ని ఆకట్టుకొని, అలరించి, మంత్ర ముగ్ధుల్ని గావించి,   అందమైన, అద్భుతమైన, అలౌకిక లోకాల్లో విహరింప చేసిన చందమామ కథా మాంత్రికుడు, జానపద నవలా సమ్రాట్
 శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారి రెండవ వర్ధంతి సందర్భంగా  జరుగు కార్యక్రమానికి  బాల సాహిత్య పరిషత్తు మీకు ఆహ్వానం పలుకు తోంది. ఈ కార్యక్రమంలో చందమామ అభిమానుల అనుభవాలు, అభిభాషణలు వుంటాయి.
ఈ సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్యం గారి కపాల దుర్గం (ప్రమోద, పిల్లల మాస పత్రిక సీరియల్ ) ఆవిష్కరణ వుంటుంది.
 ప్రమోద  సంపాదకులు, శ్రీ ధనికొండ శ్రీధర్, శ్రీ వేమూరి సత్యనారాయణ గారలు  అతిధులుగా పాల్గొనే ఈ కార్యక్రమంలో అనేక మంది చందమామ అభిమానులు పాల్గొంటారు.
వేదిక: సమావేశ మందిరం, సిటి సెంట్రల్ లైబ్రరి, అశోక్ నగర్, చిక్కడపల్లి, హైదరాబాదు.
తేది: 27-01-2012 శుక్రవారం సా: 6.30 గం:లకు.
గమనిక: ఈ కార్యక్రమంలో ఊకదంపుడు ఉపన్యాసాలుండవు.
ఆహ్వానం

Dasari Venkata Ramana
General Secretary
Balasahitya Parishat
Ph: 04024027411. Cell: 9000572573.
email: dasarivramana@gmail.com

Chokkapu Venkata Ramana
President
Balasahitya Parishat
Cell: 9246520050
email: magiccho@gmail.com

Leave a Reply

%d bloggers like this: