జనవరి 26, 2012

తెలుగులో బ్లాగుకి కొన్ని చిట్కాలు

Posted in Uncategorized at 1:28 సా. by వసుంధర

తెలుగులో టైపు చెయ్యడానికి అంతర్జాలంలో చాలా సైట్స్ ఉన్నాయి. వాటిలో కొన్నిః www.lekhini.org; www.epalaka.com; http://www.dictionary.tamilcube.com/telugu-dictionary.aspx; : http://telugu.changathi.com/Export.aspx;  
http://www.telugutyping.com/; http://www.google.com/transliterate/telugu; http://service.vishalon.net/pramukhtypepad.htm .

వీటిలో లేఖిని అనువైనదే ఐనా ఫైల్స్ సేవ్ కావు. epalaka ఫైల్స్ సేవ్ ఔతాయి.  వీటిలో matter ని వర్డ్ లో అతికిస్తే అక్షరాలకు బదులు చతురాలు కనిపిస్తాయి. ఐతే ఆ matter ని ముందుగా google.com/transliterate/telugu లో అతికించి అక్కణ్ణించి మళ్లీ కాపీ చేసి వర్డ్ లో అతికిస్తే తెలుగు అక్షరాలే కనిపిస్తాయి.  ప్రయత్నించి చూడండి- ఇది చాలా అనువు.

మిగతావాటిలో ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సింది vishalon గురించి. మీరిక్కడ చదువుతున్నది- ఈ సాఫ్ట్ వేర్ ఉపయోగించి నేరుగా బ్లాగులో టైపు చెయ్యబడింది.  

vishalon లో  మీరు MS Word, Excel వగైరాలలో కూడా నేరుగా టైపు చేసుకోవచ్చు. ఫైల్స్ ని తెలుగుపేర్లతో తెలుగు అక్షరాలతో సేవ్ చేసుకోవచ్చు.  జీమెయిల్ లో లేఖిని అంత సులభంగా తెలుగు తైపింగు చెయ్యవచ్చు. సబ్జక్టు కూడా తెలుగు అక్షరాలలో ఇవ్వచ్చు. ఇక బ్లాగులో టపాలు, వ్యాఖ్యలు, జవాబులు నేరుగా తెలుగులో వ్రాయవచ్చు. ప్రయత్నించి చూడండి.  

google.com/transliterate/telugu లో ఠ వంటి అక్షరాల టైపింగు కొంత ఇబ్బంది పెడుతుంది. vishalon వాడితే ఆ సాఫ్ట్ వేర్ లో కూడా టైపింగు చేసుకోవచ్చు. ఠ వంటి అక్షరాలు అక్కడ కూడా మామూలుగా టైపు చేసుకోవచ్చు.  vishalon సృష్టికర్తలకు అభివందనాలు.

తెలుగులో అక్షరదోషాలు తెలుసుకుందుకు- వివిధ తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ పదాలకు అర్థం, వ్యావహారిక పదాలు తెలుసుకుందుకు- అనేక నిఘంటువుల సమాహారమైన ఆంధ్రభారతి నిఘంటుశోధన చెయ్యండి.  అంతర్జాలంలో ఆంధ్రభారతికి అభివందనాలు.

2 వ్యాఖ్యలు »

 1. rahamthulla said,

  చిట్కాలు బాగున్నాయి.అలాగే సజీవ వాహిని నిర్వాహకులు తెలుగు భాషలో గొప్ప సాంకేతిక పరిజ్నానాన్ని వినియోగించి పరిశుద్ధ గ్రంధాన్ని ఎవరికి వారే వెతుక్కునేలా మంచి వెబ్ సైట్ రూపొందించారు.అయితే ఆన్ లైన్ లో మాత్రమే లభిస్తున్న ఈ సౌకర్యాన్ని ఆఫ్ లైన్ లో కూడా అందజేస్తే ఇంటర్ నెట్ లేనివారికి కూడా సౌకర్యంగా ఉంటుంది.నేను రాసే వ్యాసాలకు సజీవ వాహిని ఎంతగానో ఉపయోగ పడుతున్నది.తెలుగు భగవద్గీతకు గానీ,తెలుగు కేతలిక్ బైబిల్ కు గానీ,తెలుగు ఖురాన్ కు గానీ ఇప్పటి వరకు ఇలాంటి సదుపాయం లేదు.
  http://sajeevavahini.com/telugubible/ అందరూ చూడదగినది.మిత్రులారా ఇలాంటి సాఫ్ట్ వేర్ మిగతా మత గ్రంధాలకు కూడా లభించేలా కృషి చేస్తే లేఖనాల పరిశీలన సులభం అవుతుంది.
  తెలుగు భాష శక్తివంతం కావాలంటే తెలుగులో వెలువడిన అనేక ముఖ్య గ్రంధాలకు ఇలాంటి సాఫ్ట్ వేర్ ఎంతో అవసరం.

 2. Shridevi said,

  చాలా ఉపయుక్తమైన పొస్ట్.
  ధన్యవాదాలు

  శ్రీదేవి


Leave a Reply

%d bloggers like this: