జనవరి 29, 2012

వేమన మంత్రాలు- బాల సాహిత్యం

Posted in పుస్తకాలు at 8:10 సా. by వసుంధర

వేమన తెలుగునాట సుప్రసిద్ధ కవి.  ఆయన వ్రాసిన పద్యాలు ఐదు వేలకి పైగా ఉన్నాయి. మమూలు వాడుక పదాలతో మనసుకు హత్తుకుపోయే జీవిత సారాన్ని ఇముడ్చుకున్న అసాధారణ కవిత ఆయనది. సామాన్యులను నైతిక విలువలు అనుసరించేలా చేయగల మంత్రాలుగా వాటిని పరిగణించడం కద్దు. ప్రచారంలో ఉన్న ఆ పద్యాలను సేకరించి, అచ్చొత్తించిన ఘనత ఆంగ్లేయుడైన సి.పి. బ్రౌన్ దొరది. ఆయన తెలుగు భాషాభిమానం మనకు గర్వకారణమే కాదు, వరం కూడా. ఈ కింద పరిచయం చేస్తున్న పుస్తకంలో ఎన్నిక చేసిన వేమన పద్యాల ఆధారంగా అల్లిన ౧౫ కథలున్నాయి. రెండుముఖ్య పాత్రలతో నడిచే ఆ కథలు- ఒకదానితో ఒకటి ముడివడినా విడివిడిగానూ సంపూర్ణం. ప్రతి కథలోనూ ఒక వేమన పద్యం. ప్రతి ఒక పేజీ కథకూ- ప్రక్కనే ఒక పేజీ రంగుల బొమ్మ. ఈ కథలు పిల్లలకని ఉద్దేశించినా, అన్ని వయసులవారినీ అలరించగలవనిపిస్తుంది.  ఈ పుస్తకం ఆంగ్లానువాదం వివరాలకి ఇక్కద క్లిక్ చెయ్యండి.

2 వ్యాఖ్యలు »

 1. ఈ పుస్తకం ప్రవాసంలో ఉన్న వాళ్ళకు కావాలంటే ఏం చెయ్యాలి?

  • ‘వేమన మంత్రాలు’ (తెలుగు/ఇంగ్లీషు) పుస్తకం కావలసినవారు తమకు కావలసిన కాపీల సంఖ్య తెలియజేస్తూ వాటి ఖరీదును ప్రచురణకర్తలకు పంపితే వెంటనే, ఖర్చులు భరించి, పోస్టులో పంపుతారు.
   విదేశాల్లో ఉన్నవారికి పంపడానికి ఎయిర్‌ మెయిల్‌ ఖర్చు భారీగా ఉంటుంది కాబట్టి అది కూడా కలిపి పంపాల్సి ఉంటుంది. ఈ విషయమై ప్రచురణకర్తలను ఈమెయిల్‌/ఫోన్‌ ద్వారా సంప్రదించగలరు.
   ప్రచురణకర్త చిరునామా :
   శ్రీ పి. సుబ్బయ్య
   కావ్య పబ్లిషింగ్‌ హౌస్‌
   ఫ్లాట్‌ నెం, 103 ; ఎస్‌.ఆర్‌.ఆర్‌. ఎపార్ట్‌మెంట్స్‌
   హౌస్‌ నెం. 12-13-830/13/బి
   గోకుల్‌ నగర్‌ ; తార్‌నాకా
   సికింద్రాబాద్‌ – 500 017 ఫోన్‌ : 9866559867
   email : kavyaph11@gmail.com


Leave a Reply

%d bloggers like this: