జనవరి 30, 2012

కథల పోటీ- స్వప్న

Posted in కథల పోటీలు at 9:22 సా. by వసుంధర

స్వప్న మాసపత్రిక నిర్వహిస్తున్న కథల పోటీః శ్రీమతి గొర్రెల అప్పాయమ్మ పురస్కారం
రూ 10,000/- విలువ చేసే బహుమతులు
పోటీకి వచ్చిన కథల్లో నాలుగు కథల్నిఉత్తమ కథలుగా ఎంపిక చేసి ఒక్కొక్క కథకి రూ. 2,500 /- చొప్పున బహుమతి.
నిబంధనలు:
కథలు తెలుగు వారి సామాజిక, కుటుంబ జీవితానికి సంబంధించినవై వుండాలి.
హాస్య కథలు, క్రైమ్ కథలు, శృంగార కథలు పంపకూడదు (అయితే కథల్లో కాస్త హాస్యం పాలు, వ్యంగ్యమూ ఉండచ్చు కానీ పూర్తి హాస్యం కూడదు)
కథలు ఫుల్ స్కేప్ సైజులో (పేజీకి 30 లైన్ల చొప్పునైతే) 6 పేజీలకు మించకూడదు. (ఓ అరపేజీ దాకా మినహాయింపు)
కథ తమ స్వంత రచన అన్న హామీ పత్రం జతపరచాలి. ఎంపిక తుది నిర్ణయం సంపాదకులదే
తిరిగి పంపగోరువారు తగిన తపాలా బిళ్ళలు గల కవరును జతపరచాలి.
కథలు పంపవలసిన చివరి తేదీ: మే 2, 2012
కథలు పంపవలసిన చిరునామాః Editor, Swapna Monthly, Sterling Media & Entertainment, 2/3, North Usman Road, T’Nagar, Chennai 600 017
బహుమతి పొందిన కథల ప్రచురణ: జూన్ 2012 సంచిక నుంచి
గమనిక: రచనలు పంపినవారు ఫలితాలు వెలువడే జూన్ సంచిక దాకా వేచి వుండకుండా, వారికి బహుమతి ఎంపికకు అర్హం కానివి అని భావించిన వాటిని ఎప్పటికప్పుడు త్రిప్పి పంపుతాము. ఇందువల్ల ఆయా రచయితలు, రచయిత్రులు పోటీ గడువు లోపల మరో కథ పంపడానికి అవకాశం వుంటుంది. 
ఈ సమాచారం అందజేసిన శ్రీ అరిపిరాల సత్యప్రసాద్‍కి ధన్యవాదాలు.  

5 వ్యాఖ్యలు »

  1. Jahnavi said,

    Thank You very Much for your valuable info.


Leave a Reply

%d bloggers like this: