ఫిబ్రవరి 15, 2012

వంగూరి వారి సదస్సు పిలుపు

Posted in సాహితీ సమాచారం at 4:42 సా. by వసుంధర

నమస్కారం,

ఎలా ఉన్నారు?

భారత దేశం ఎల్లలు దాటి విదేశాలలో మొట్ట మొదటి సారిగా కేవలం తెలుగు భాషా, సాహిత్య సమాలోచనలకే ప్రాధాన్యత ఇస్తూ రాబోయే మార్చ్ 10-11. 2012 తేదీలలో  అమెరికాలోని హ్యూస్టన్. టెక్సస్ మహానగరంలో జరుగుతున్న మూడవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకు మిమ్మల్ని సాదరంగా ఆహ్వనిస్తున్నాం. అత్యంత ప్రతిష్తాత్మకమైన ఈ అంతర్జాతీయ తెలుగు సదస్సు పూర్తి వివరాలు ఇందుతో బాటు జతపరిచాం.

అమెరికా, కెనడా, ఇంగ్లండ్, మధ్య ప్రాచ్య దేశాలు మరియు భారత దేశాలనుంచి సాహితీ ప్రముఖులు విచ్చేస్తున్న ఈ మహాసభలలో ప్రసంగించదల్చుకున్న వారు మమ్మల్ని వెనువెంటనే సంప్రదించండి.సదస్సుకు వచ్చి ఆనందించదలుకున్న వారు వెనువెంటనే నమోదు చేసుకోండి.

ఏ కారణానికైనా ఈ మహాసభలకి వచ్చే వీలు లేక పోతే, లాభాపేక్షలేని మా ప్రయత్నానికి కేవలం సభానిర్వహణ ఖర్చుల నిమిత్తం మీకు తోచిన విరాళాన్ని పంపించి మీ తెలుగు సాహిత్యాభిమానాన్ని చాటుకోండి. అన్నట్టు, విరాళాలు ఏ దేశం కరెన్సో లో అయినా మా వెబ్ సైట్ (www.vangurifoundation.org) లో ఆమోదించబడతాయి. వివరాలకు జతపరిచిన ప్రకటనలు, నమోదు పత్రం చూడండి. తెలుగు భాషా, సాహిత్యాల ప్రోద్బలానికి టీవీ 9 మరియు సాక్షి టీవీ వారు, అనేక తెలుగు పత్రికలూ, స్థానిక తెలుగు రేడియో ప్రసార మాధ్యమాలు భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారు.

మూడవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకు మరొక సారి సాదరంగా ఆహ్వానం పలుకుతూ…ఇదే మా వ్యక్తిగత ఆహ్వానంగా మన్నించమని కోరుతూ..

మీ తోటి తెలుగు భాషాభిమానులు, ..

 

వంగూరి చిట్టెన్ రాజు, శారద ఆకునూరి, సాయి రాచకొండ, రామ్మోహన్ చెరువు, సుధేష్ పిల్లుట్ల, సత్యభామ పప్పు, అనిల్ కుమార్, హేమా నళిని తల్లవఝ్ఝుల, చలపతి అక్కరాజు, రాజ్ పసల, కృష్ణ కీర్తి, ఇందిర చెరువు, సుమన నూతలపాటి.

(కార్యనిర్వాహక సభ్యులు, మూడవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు)      ఆహ్వానం     రిజిస్ట్రేషన్

Leave a Reply

%d bloggers like this: