ఫిబ్రవరి 24, 2012

బుల్లితెరపై ఎదురీత

Posted in టీవీ సీరియల్స్ at 7:13 ఉద. by వసుంధర

కొందరికి అసూయ. కొందరికి పగ. కొందరికి అసహనం. అలా ఏర్పడతారు ప్రత్యర్ధులు. వారిని సాధించడానికి రౌడీలని పెట్టి కొట్టించడం, విషం పెట్టి చంపేయడం, కిడ్నాప్ చేసి బంధించి హింసించడం వగైరాలు చెయ్యాలనుకోవచ్చు. అందుకు తెలివి అక్కర్లేదు. కొంచెం డైర్యం, కొంచెం సిగ్గుమాలినతనం,  కొంచెం చెడ్డతనం ఉండాలి.  కథల్లో అటువంటి పాత్రలు సృష్టించడానికి బుర్రలో తెలివి అవసరం లేదు. కలంలో సిరా ఉంటే చాలు. ఇటీవల బుల్లితెరపై మనం చూస్తున్న డెయిలీ సీరియల్స్ లో మనం చూస్తున్న పాత్రలు అలా కలంలో సిరాతో పుట్టుకొస్తున్నవే! అసలౌ డెయిలీ సీరియల్స్ కి కథ అవసరం లేదనీ- కొన్ని పాత్రల్ని ఎన్నుకుని- ఏరోజుకారోజు కాలక్షేపం చేసేలా కథ నడిపించేయడమేననీ నిర్వాహకులు భావిస్తున్నారు. ప్రేక్షకులూ సరిపెట్టుకుంటున్నట్లే కనిపిస్తుంది. ఆ తీరుకు భిన్నంగా వెళ్లడం ఎదురీత అనుకునే నిర్మాతలు ఎక్కువ. కానీ ‘ఎదురీత’కు సిద్ధపడ్డారు జస్ట్ యెల్లో సంస్థ.

మా టివిలో గత సంవత్సరం అక్టోబర్ 31న మొదలైన ఎదురీత డైలీ సీరియల్ నిజంగా ఓ అద్భుతం.  మధ్యతరగతి జీవితాన్ని వాస్తవ పాత్రలతో, పల్లెటూరి వాతావరణంలో ఆహ్లాదకరంగా చిత్రీకరిస్తున్న తీరు అపూర్వం. ఈ సీరియల్ కి బలం కథ.  ఆపేక్షలు, అభిమానాలతోపాటు కుట్రలు, కుతంత్రాలు కూడా కలగలిసిన ఈ వాస్తవ కథ- రచయిత సృజనాత్మకతకూ, మేధాశక్తికీ నిదర్శనం. పాత్రలకు ప్రాణం పోస్తున్న నటులు, నటులకు ప్రాణం పోస్తున్న సంభాషణలు, వీటన్నింటికీ దీటైన దర్శకత్వం- ఈ సీరియల్ కి వన్నె తెచ్చాయి. ఆలోచనలకు పదును పెడుతూ, జీవితంపట్ల అవగాహనను పెంచే ఇలాంటి సీరియల్ చూడ్డంలోనే ప్రేక్షకులకు పుణ్యమూ, పురుషార్థమూ!

బుల్లితెర గర్వపడతగ్గ ఈ సీరియల్ ప్రతివారం సోమ-శుక్రవారాల్లో రాత్రి 8.30-9 మధ్య మా టివిలో చూడవచ్చు
మొదట్నించీ ఈ సీరియల్ చూడాలనుకునేవారు ఇక్కడ క్లిక్ చెయ్యండి.  

   

2 వ్యాఖ్యలు »

  1. T.S.Kaladhar said,

    appudappudu nenu edureeta serial choostuntaanu. Paatradharulu ekkadaa overaction cheyyakunda chaalaa baagaa natistunnaru

  2. malapkumar said,

    నేనూ ఈ సీరియల్ చూస్తాను .బాగుంటుంది .


Leave a Reply to malapkumar Cancel reply

%d bloggers like this: