మార్చి 7, 2012

కార్టూన్స్ పోటీలు

Posted in కథల పోటీలు at 11:25 ఉద. by వసుంధర

 హాస్యానందం పత్రికలో వచ్చిన ఈ  క్రింది రెండు ప్రకటనలు- అక్షరజాలం కోసం శ్రీఅరిపిరాల సత్యప్రసాద్ పంపించారు. వారికి ధన్యవాదాలు.
మే 20న శ్రీ తలిశెట్టిరామారావు జయంతి సందర్భంగా, తెలుగు కార్టూనిస్ట్ ల దినోత్సవంగా ఆంధ్రప్రదేశ్ క్రోక్విల్ అకాడమీ, హాస్యానందం, ముఖీ మీడియా సంయుక్తంగా తలిశెట్టి రామారావు అవార్డు – విశిష్ట కార్టూన్ పోటీలు నిర్వహిస్తున్నారు.
ప్రథమ బహుమతి: రూ 2000/- లు
ద్వితీయ బహుమతి: రూ 1000/- లు
విశిష్ట బహుమతులు (10): రూ 200/- లు
ఇంకా ఎన్నో ప్రశంసా పత్రాలు…

నిబంధనలు
కార్టూన్ A4 సైజులో తప్పనిసరిగా వుండాలి. సబ్జెక్ట్ మీ ఇష్టమే!
ఒకరు 4 కార్టూన్లు మాత్రమే పంపాలి.
కాప్షన్ లెస్ కార్టూన్లయితే మరీ మంచిది
సెలక్ట్ కానీ కార్టూన్లు తిరిగి పంపగోరువారు తగిన స్టాంపుల కవరు జత పరచాలి.
పరిశీలనలో వున్నవి, కాపీ కార్టూన్లు పంపవద్దు
మీ పూర్తి బయోడేటా ఫొటోతో సహా తప్పనిసరిగా జత చెయ్యాలి
ఎంట్రీలన్నీ వివిధ నగరాల్లో ప్రదర్శించడానికి అనుమతినివ్వాలి

కార్టూన్లు చేరవలసిన ఆఖరు తేదీ: 20.03.2012

చిరునామా
హాస్యానందం
#8-215/4, Near Ramalayam
PO: Yerrabalem – 522 503
Managalagiri Mandal
Guntur Dist
రాష్ట్రస్థాయి కార్టూన్ పోటీలు మరియు ప్రదర్శన

కార్టూన్ సకల కళల – సకల జనుల కళగా నమ్మి గత దశాబ్దంన్నర కాలంగా వికాసం (విశాఖ కార్టూనిస్టుల సంఘం) కార్టూన్ పోటీలు, ప్రదర్శనలు నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం వేసవిలో కార్టూన్ల ప్రదర్శనకు సిద్ధం అవుతోంది. ఈ నేపధ్యంలో కార్టూన్ల పోటీ నిర్వహిస్తూ –
మూడు ఉత్తమ కార్టూన్లకు రూ 500/- లు నగదు బహుమతి

అంశాలు: రోడ్డు భద్రత – ట్రాఫిక్ సెన్స్; సివిక్ సెన్స్

నిబంధనలు
కార్టూన్లు A4 సైజులో రంగులలోనే చిత్రించాలి.
చిరునామా, ఈ మెయిల్, ఫోన్ నెంబరు కార్టూన్ వెనక రాయాలి
కార్టూన్ కచ్చితంగా నవ్వు తెప్పించేవిగా ఉండాలి

ఆఖరు తేదీ: 30.03.2012
పంపవలసిన చిరునామా: బి హరి, కోరాడ రాంబాబు, కన్వీనర్స్, వికాసం కార్యాలయం, 50-6-24/1 శ్రీహరి వీధి, సీతంపేట, విశాఖపట్టణం,

email: hari_vskp@yahoo.com

Leave a Reply

%d bloggers like this: