మార్చి 11, 2012

కవితలకు ఆహ్వానం- శిరాకదంబం

Posted in సాహితీ సమాచారం at 6:33 సా. by వసుంధర

శ్రీ శిష్ట్లా రామచంద్ర రావు గారి ఆహ్వానం !!
శిరాకదంబం అంతర్జాల సాహితీ పత్రిక నుండి..
మిత్రులకు వందనం. అభివందనం.

‘ శిరాకదంబం ‘ అంతర్జాల పత్రికకు మీ రచనలు, సలహాలు, సూచనలతో ప్రోత్సాహాన్నందించి విజయపథంలో నడిపిస్తున్న మీకు మా హృదయ పూర్వక ధన్యవాదములు.

రాబోయే శ్రీ నందన నామ ఉగాదిని పురస్కరించుకుని వినూత్న పంథాలో  అంతర్జాలంలో ఒక కవి సమ్మేళనం నిర్వహించాలని సంకల్పిం చాం,
ఈ విశాల ప్రపంచంలో ఎక్కడెక్కడో వున్న కవి మిత్రుల్ని అందర్నీ ఒకే వేదిక మీదకు తీసుకురావడానికి చేస్తున్న వినూత్న ప్రయోగమే ఈ అంతర్జాల కవి సమ్మేళనం.

ఇందులో మీ కవితలని… మీరే స్వయంగా… మీ స్వరంలో… ధ్వని ముద్రణ చేసి ఆడియో ఫైల్ పంపితే…. అందరివీ ఒక చోట చేర్చి ఉగాది సంచికలో ప్రచురించడం జరుగుతుంది. 

దానికి సంబంధించిన విధి విధానాలు, సూచనలు, పాటించాల్సిన నియమాలు, చివరి తేదీ లాంటి వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి మీ కవితా గానాన్ని మీ స్వరంలోనే ధ్వని ముద్రణ చేసి శిరాకదంబం కి అందించి శ్రీ నందన ఉగాది సంబరాన్ని విజయవంతం చెయ్యగలరని ఆశిస్తూ…..

భవదీయుడు

శి. రా. రావు

(ఈ లేఖ అందజేసిన శ్రీదేవి మురళీధర్ కి ధన్యవాదాలు) 

Leave a Reply

%d bloggers like this: