మార్చి 30, 2012

కథలు, కవితల పోటీలు

Posted in కథల పోటీలు at 10:29 ఉద. by వసుంధర

ఆశ మాస పత్రికలో వచ్చిన మరో రెండు ప్రకటనల వివరాలను క్రింద చూడగలరు. అందజేసిన శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ కి ధన్యవాదాలు.
కవితా సంకలనాలు పంపండి
పెన్నా సాహిత్య పురస్కారానికి గాను 2011 – 12లో ప్రచురించిన తమ కవితా సంపుటాలను కవులు మూడు ప్రతుల చొప్పున ఏప్రిల్ 15వ తేదీలోగా పంపించగలరు. ఉత్తమ కవితా సంపుటికి రూ. 5 వేల బహుమతి ఉంటుంది. చిరునామా: సూర్య షంషుద్దిన్, సూర్య స్కూల్ దగ్గర, జెడ్.పి. కాలని, నెల్లూరు – 524004, ఫోన్: 9493384684
****************************
సాహితీ కిరణం కథల, కవితల పోటీ
సాహితీ కిరణం మాస పత్రిక తృతీయ వార్షికోత్సవం సందర్భంగా కథల పోటీ నిర్వహిస్తోంది. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ. 1800, 1200, 750 బహుమతులతో పాటు రూ. 250 చొప్పున ప్రోత్సాహం బహుమతులు కూడా ఉత్తమ కథలకు ఇవ్వబడును. కవితల పోటీలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ. 1500, 1000, 500, రూ. 200 చొప్పున ప్రోత్సాహ బహుమతులు ఉత్తమ కవితలకు ఇవ్వబడును. చివరి తేది ఏప్రిల్ 30, చిరునామా: సాహితీ కిరణం 11-13-154, అలకాపురి, రోడ్ నెం 3, హైదరాబాద్ – 35, ఫోన్: 9490751681
సాహితీ కిరణం పత్రిక పోటీలకు పత్రిక చందాదారులు మాత్రమే అర్హులు. గమనించగలరు.

3 వ్యాఖ్యలు »

  1. సాహితీ కిరణం పత్రిక పోటీలకు పత్రిక చందాదారులు మాత్రమే అర్హులు. గమనించగలరు.

  2. ఆన్లైన్ లో పంపాలనుకుంటే మెయిల్ ఐ డి ఇవ్వగలరా?

    • మాకు తెలిసి ఈ పోటీలకు ఆన్‍లైన్ లో పంపే సదుపాయం లేదు.


Leave a Reply

%d bloggers like this: