ఏప్రిల్ 7, 2012

ఆంధ్రభూమి — నాటా అంతర్జాతీయ తెలుగు కథల పోటీ

Posted in కథల పోటీలు at 10:16 ఉద. by వసుంధర

కథకులకో కమ్మని కబురు (ఈ కబురు అందజేసిన శ్రీ సత్యాజీకి ధన్యవాదాలు) 
ఉత్తమ సాహితీసృజనను ప్రోత్సహించే సంకల్పంతో ఆంధ్రభూమి దినపత్రిక ఆధ్వర్యంలో ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) మొట్టమొదటి అంతర్జాతీయ తెలుగు కథల పోటీ నిర్వహిస్తున్నది
ప్రథమ బహుమతి (1): రూ.20,౦౦౦ (500డాలర్లు)
ద్వితీయ బహుమతులు (2): రూ.10,000 (250డాలర్లు)
తృతీయ బహుమతులు (2): రూ.5,౦౦౦ (116డాలర్లు)
* కథ ఇతివృత్తం మీ ఇష్టం. వస్తువులో, కథన శైలిలో కొత్తదనాన్ని కోరుతున్నాం.
*ఈ కాలపు జీవన రీతికి, ఈ తరం అభిరుచులకు, మారుతున్న విలువలకు కొత్త కోణంలో అద్దంపట్టగలిగితే మంచిది.
* కథ నిడివి ఎ 4 సైజులో, (12 పాయంట్),అచ్చులో మూడు పేజీలకు మించకుండా వుండాలి. ఈ లెక్కన తమ స్క్రిప్టు ఎన్ని పేజీలు వుండాలో ఎవరికివారు లెక్కవేసుకోవచ్చు.
* రచయిత పేరు (కలం పేరు వాడితే) అసలు పేరు, చిరునామా, ఫోన్ నంబరు స్పష్టంగా రాయాలి.
*రచన తన సొంతమనీ, దేనికీ కాపీ కాదనీ, అనుకరణ, అనుసరణ కూడా కాదనీ, వేరే ఏ పోటీకి పంపలేదనీ, ఇంకే పత్రిక పరిశీలనలో లేదని హామీపత్రం తప్పనిసరిగా జతపరచాలి. ఇష్టమైతే ఫొటో కూడా పంపవచ్చు.
* గతంలో ఆంధ్రభూమి, దిన, వార, మాస పత్రికలకు పంపితే తిరిగొచ్చిన వాటిని పంపకూడదు.
*రచన సొంత దస్తూరితో కాని, డి.టి.పి చేసి గాని పంపాలి. జిరాక్స్ కాపీలు, కార్బన్ కాపీలు పరిశీలించబడవు.
*ఎంపికైన కథలు ఆంధ్రభూమి దినపత్రికలోనూ, నాటా ప్రచురించే ‘నాటామాట’ సంచికలోనూ వీలును బట్టి ప్రచురితమవుతాయి.
*దేశీయ విజేతలకు హైదరాబాద్‌లో నాటా నిర్వహించే సభలోనూ, విదేశీ విజేతలకు అమెరికాలో జరిగే కార్యక్రమంలోనూ బహుమతులు అందచేస్తారు.
*పేర్కొన్న బహుమతి మొత్తాలు దేశీయ విజేతలకు రూపాయల్లో, విదేశీ విజేతలకు డాలర్లలో ఇవ్వబడతాయ.
* బహుమతి పొందని రచనలలో ఎంపిక చేసిన వాటిని సాధారణ ప్రచురణకు స్వీకరిస్తాము. వాటిని దినపత్రికలో గానీ, ఆదివారం అనుబంధంలో గానీ, ఆంధ్రభూమి వార/మాసపత్రికలో గానీ వీలువెంబడి, మా ఇష్టాన్నిబట్టి ప్రచురించవచ్చు.
* సాధారణ ప్రచురణకు కూడా స్వీకరించని రచనలను తిప్పి పంపాలంటే తగిన స్టాంపులు అతికించి చిరునామా రాసిన కవరు జతపరచాలి. స్టాంపులు, కవరు విడిగా పంపితే గల్లంతు కావచ్చు.
* పోటీకి సంబంధించిన అన్ని అంశాలపైనా సంపాదకుడిదే తుది నిర్ణయం. దానిపై ఉత్తరప్రత్యుత్తరాలు కుదరవు.
కథలు పంపాల్సిన చిరునామా:
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక,
36, సరోజినీ దేవి రోడ్, సికిందరాబాద్ -3
ఫోన్: 040-27805056, 27803930
ఇ-మెయిల్‌లో పంపాలనుకునే వారు
abcontest@deccanmail.com,
vangurifoundation@gmail.com అనే రెంఢు చిరునామాలకూ తమ ఎంట్రీలను పంపాలి.
కథలు పంపడానికి ఆఖరు తేదీ 25.4.2012 

Leave a Reply

%d bloggers like this: