Site icon వసుంధర అక్షరజాలం

శ్రీ పులుగుర్త వెంకట రామారావు

శ్రీ పులుగుర్త వెంకట రామారావు (1902-64) మహాకవి, పండితుడు, అవధాని, అధ్యాపకుడు, మావతావాది, సమాజసేవా దురంధరుడు.  అల్లసాని పెద్దన ‘పూత మెరుంగులున్’ మాలికను తలపించేలా, మరపించేలా ఆయన వ్రాసిన నలుబదినాలుగు పాదాల మాలిక ఆయన ప్రతిభకు ఓ చిన్న ఉదాహరణ.  ఈరోజు దూరదర్శన్ సప్తగిరి ఛానెల్లో ఉదయం 9-9.30 మధ్య ఉత్తమాభిరుచికి మారుపేరైన శ్రీ వోలేటి పార్వతీశం నిర్వహణలో వచ్చే ‘తెలుగుతోట’ శీర్షికలో- శ్రీ రామారావు చిరు పరిచయం, మాలిక పఠనం ఒక భాగం. మాలిక వినిపించినవారు- శ్రీ రామారావు అభిమాని, పద్యసాహితీ ప్రచారకుడు, ప్రముఖ ఉపాధ్యాయుడు- శ్రీ అయ్యగారి వెంకట్రామయ్య.  ఈ కార్యక్రమం తిరిగి రేపు (మంగళవారం రాత్రి 8.30-9 madhyalOమధ్యలో పునఃప్రసారం ఔతుంది. ఆసక్తి ఉన్నవారికోసం ఈ సమాచారం.

శ్రీ రామారావు మా తాతగారు. వారి ముచ్చట్లు, ఆసక్తికరమైన వివరాలు, రచనలు వగైరా మున్ముందు అక్షరజాలంలో క్రమంగా అందించగలం. ఏటా అక్టోబరులో రచన మాసపత్రికలో కథాపీఠం వారిని స్మరిస్తుంది. ఆ వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి.

ఈ శతాబ్దంలోనూ కొన్ని దినపత్రికలు వారిని సంస్మరించాయి. ఆ స్పందనలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి.  

 

 

Exit mobile version