మే 3, 2012

కథల పోటీలు- నవ్య

Posted in కథల పోటీలు at 4:21 సా. by వసుంధర

ఎస్.కె.మిశ్రో – నవ్య వీక్లి సంయుక్త నిర్వహణలో కథల పోటీ
కథకు రూ. 5,000  చొప్పున 10 కథలకు రూ. 50,000 నగదు బహుమతి
నిబంధనలు
కథ తెలుగు వరి జీవితానికి అద్దం పట్టేలా ఉండాలి.
ప్రపంచంలోని ఏ ప్రాంతమైనా కథకు నేపథ్యం కావచ్చు. అయితే అది తెలుగువారి జీవితనికి సంబంధించినదై ఉండాలి.
కథ అరఠావు సైజులో 10 పేజీలకు మించకుండా ఒకవైపునే రాసి పంపాలి. దస్తూరి చక్కగా అర్థమయ్యేలా ఉండాలి. డి.టి.పి. చేయించిన పక్షంలో అది 6 పేజీలకు మించరాదు.
కథను పంపేటప్పుడు రచయిత/రచయిత్రి పేరు అందులో ఉండరాదు. పేరు, పూర్తి చిరునామా వేరే కాగితం మీద రాసి జత పరచాలి. హామీ పత్రం విధిగా జత చేయాలి. కవరు మీద ’నవ్య వీక్లీ కథల పోటీకి’ అని స్పష్టంగా పేర్కొనాలి.
బహుమతి కథలు నవ్య వీక్లీలో ప్రచురితమవుతాయి.
ఈ కథల్ని నాటకీకరణ చేసే అవకాశం ఉంది. నచ్చిన కథల్ని నాటకీకరణ చేసి ప్రదర్శిస్తారు. ఇందుకు రచయితలు అంగీకరించాలి.
కథలు పంపవలసిన చిరునామా: నవ్య వీక్లీ, ఆంధ్రజ్యోతి బిల్డింగ్స్, ప్లాట్ నెం. 76, రోడ్ నెం.  10, అశ్వనీ లే అవుట్, హుడా హైట్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ – 500033
కథలు చేరవలసిన ఆఖరు తేదీ 14 జులై 2012 
ఈ సమాచారం అందజేసిన శ్రీ అరిపిరాల సత్యప్రసాద్‍కి ధన్యవాదాలు.

Leave a Reply

%d bloggers like this: