మే 27, 2012

కవితా పురస్కారం 2012

Posted in సాహితీ సమాచారం at 3:15 సా. by వసుంధర

ఈ క్రింది ప్రకటన నవ్య వారపత్రిక నుంచి –

 
’శాంతి రజనీకాంత్ స్మారక కవితా పురస్కారానికి’ విమలా శాంతి సాహిత్య సాంఘిక సేవా ట్రస్త్ జాతీయ స్థాయిలో ఉత్తమ కవితా సంపుటాలను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు ట్రస్టు చైర్మన్ డాక్టర్ శాంతి నారాయణ ఒక ప్రకటన చేశారు. కథకు, కవిత్వానికి విడతలవారీగా యేటా ఇస్తున్న పురస్కారాల్లో భాగంగా ఈ ఏడాది కవిత్వానికి 10 వేల రూపాయలు నగదు, జ్ఞాపిక అందజేస్తారు. రచనలు సమకాలీన సామాజిక జీవితాన్ని చిత్రించినవై ఉండాలి. 2010-2011 మధ్యకాలంలో ప్రచురించిన కవితా సంపుటాలను మాత్రమే పరిశీలిస్తారు. నానీలు, మినీ కవితా సంపుటాలను తీసుకోరు.
 
రచనలను యస్వీ ప్రసాద్, ఇం.నెం. 28/4/271, విజయనగర్ కాలనీ, అనంతపురం- 7 చిరునామాకు జులై 15వ తేదీ లోపి నాలుగు ప్రతులు పంపించాలి. ఎంపికైన కవితా సాంపుటి రచయితకు ఈ ఏడాది సెప్టెంబరులో జరిగే సభలో అవార్డు ప్రదానం చేస్తారు.
ఈ సమాచారం అందజేసిన శ్రీ అరిపిరాల సత్యప్రసాద్‍కి ధన్యవాదాలు.

Leave a Reply

%d bloggers like this: