జూన్ 21, 2012

శాస్త్రీయం

Posted in శాస్త్రీయం at 8:48 సా. by వసుంధర

శ్రీ టి.వి.ఎస్ శాస్త్రి తెలుగు భాషా ప్రేమికులు. సాహితీ పిపాసులు. వారు తమకు తెలిసిన సినీ, సాహితీపరుల సమాచారాన్ని మనతో పంచుకుంటున్నారు. శిరాకదంబంలో వారి రచనలకోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి. అక్షరజాలం వారి వ్యాసాల్ని రచనాజాలంలో ‘శాస్త్రీ’యం గా అందిస్తుంది. వారి మాటల్లో వారి వివరాలివి.

నేను గుంటూరు నగర నివాసిని. ఆంద్ర బ్యాంకులో ఆఫీసర్ గా, మేనేజర్ గా వివిధ హోదాలలో, వివిధ ప్రదేశాలలో పనిచేసి, ప్రస్తుతం నా విశ్రాంత జీవితాన్నిగుంటూరులోనే అవిశ్రాంతంగా గడుపుతున్నాను. నా రచనలకు ప్రధమ అభిమానురాలు, విమర్శకురాలు నా భార్యే! ఆమె గృహిణి. నాకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు వున్నారు. ఒక కూతురు,  కుమారుడు అమెరికాలో వున్నారు. పెద్ద అమ్మాయి చెన్నైలో వుంటుంది. అందరూ సంతానవతులే. ఆనందంగా వున్నారు. ఈ మధ్యనే అమెరికాకు వెళ్లి వచ్చాను. నాకు 61 సంవత్సరములు. రచన నాకొక వ్యాసంగం, వ్యాపకం. అన్నీ చదువుతాను. వేటి ప్రభావం నా మీద పడకుండా స్వేచ్ఛగా వుంటాను. నలుగురికి ఆనందం కలిగించటానికి  వ్రాస్తూ నేనూ ఆనంద పడుతాను.

2 వ్యాఖ్యలు »

 1. TVS SASTRY said,

  వసుంధర గారికి,
  నన్నుమీ పాఠకులకు చక్కగా పరిచయం చేయటమే కాకుండా,నా రచనల శీర్షికకు ‘శాస్త్రీయం’ అనే నామకరణం చేసి ‘బాల సారే’ చేసినందుకు చాలా సంతోషం,కృతజ్ఞతలు.మీ వంటి పెద్దల ఆశిస్సులే నాకు శ్రీ రామరక్ష.
  భవదీయుడు,
  టీవీయస్.శాస్త్రి

 2. SAhri said,

  Nice seeing you on yet a different platform Shastri garu.
  Kind of you to encourage and appreciate talent Vasundhara garu

  Shri


Leave a Reply

%d bloggers like this: