జూన్ 25, 2012

కథల పోటీ- చైతన్య మానవి

Posted in కథల పోటీలు at 9:35 సా. by వసుంధర

శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ తెలియజేస్తున్నారు….

అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యాన వెలువడుతున్నత్రైమాసిక పత్రిక చైతన్య మానవి దశమ వార్షికోత్సవం సందర్భంగా కథల పోటీ నిర్వహిస్తోంది. ఈ పోటీలో ఎంపికైన కథలతో ప్రత్యేక సంచిక వెలువడుతుంది. ఈ పోటీలో పాల్గొనవల్సిందిగా రచయిత(త్రు)లకు మనవి.  

మొదటి బహుమతి రూ.1000, రెండో బహుమతి రూ.500, మూడో బహుమతిగా రూ.300.

సాధారణ ప్రచురణకు స్వీకరించిన ప్రతి కథకు రూ.100ల పారితోషికం ఉంటుంది. విద్యార్థినులు, మహిళలు, శ్రామిక మహిళలకు సంబంధించిన సమకాలీన అంశాలు కథా ఇతివృత్తంగా ఉండాలి. కథ ప్రింట్‌లో ఎ4 సైజులో రెండు పేజీలకు మించరాదు.
కథలు అందాల్సిన చివరి తేదీ : జూన్‌ 30, 2012.
కథలు పంపాల్సిన చిరునామా :
చైతన్య మానవి
అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర కార్యాలయం
బ్లాక్‌ నెం. 24 హెచ్‌ఐజి, బ్లాక్‌-24, 1-8-1, బాగ్‌లింగంపల్లి.
హైదరాబాద్‌ – 500044. ఫోన్‌ నెంబరు : 040-27605845
ఇ మెయిల్‌ : chaitanyamanavi@gmail.com

1 వ్యాఖ్య »

  1. చాలా తక్కువ టైము ఇస్తే హైదారాబాదు కాక వేరే చోటవున్నవారు పోస్టు లో పంపేది ఎలా అని నాలాగా ఎవరైనా అడుగుతారేమో ..
    లక్ష్మీ రాఘవ


Leave a Reply

%d bloggers like this: