జూలై 5, 2012
సప్తగిరిలో తోట, శాస్త్ర
దూరదర్శన్ సప్తగిరిలో వ్యాపారాత్మకం కాని ఆసక్తికరమైన కార్యక్రమాలు చాలా వస్తున్నాయి. అడపాతదపా వచ్చే టెలిఫిల్మ్స్ స్థాయి కూడా ఉన్నతంగా ఉంటోంది. అనుకోకుండా (బహుశా జూన్ 25 ఉదయం 10 తర్వాత) ‘కోటికొక్కడు’ అనే టెలిఫిల్మ్ చూశాం. ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగిన ఆచిత్రంలో ఇతివృత్తం, దర్శకత్వం, నటనల పరంగా ఉన్నత ప్రమాణాల్లో ఉన్నాయి. ఆ చిత్రాన్ని స్వర్గీయ శ్రీ అగస్త్యశాస్త్రి స్మృత్యర్థం పునఃప్రసారం చేస్తున్నట్లు తెలిపారు.
మనకిప్పుడు ఎన్నో ఛానెల్స్. ఎన్నో కార్యక్రమాలు. అన్నీ అందరికీ చూడ్డం సాధ్యం కాదు. మేము చూసినవి అడపాతడపా విశ్లేషించి ప్రచురిస్తున్నాం. మంచి కార్యక్రమాల ప్రచారానికి అక్షరజాలం వేదిక కావడానికి మీ అందరి సహకారం కోరుతున్నాం.
సప్తగిరిలో వచ్చే తెలుగు తోట, శాస్త్ర- కార్యక్రమాలపై ఆంధ్రభూమి దినపత్రికలో వచ్చిన కె.పి. అశోక్ కుమార్ సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి. మా ప్రస్తావన ఉండడంవల్ల కొందరు మిత్రులు ఈ సమీక్షను మా దృష్టికి తీసుకొచ్చారు. మా ప్రసక్తితో నిమిత్తం లేకుండా ఇటువంటి సమీక్షలని మా దృష్టికి తీసుకురావలసిందిగా మీకు మా మనవి.
MOORTHY OVSN said,
జూలై 5, 2012 at 1:08 సా.
క్రిందటి నెల వేయిపడగలు సీరియల్ పూర్తి అయ్యింది నాకు ఇంతవరకు ఈ సీరియల్ వున్నది అని తెలియదు
ఎందుకంటే చిన్నప్పుడు నా కుతూహలం తో ఆ గ్రంధం చదివాను.
అలాగే మనిషి అనే తేలి సీరియల్ సుభలేఖ సుధాకర్ హీరో ఎప్పుడు వచ్చిన చూడండి
మంచి సీరియల్.
సత్యం