జూలై 8, 2012

నీతి గీతలకు ఆవల

Posted in శాస్త్రీయం at 4:44 సా. by వసుంధర

‘పెట్టనమ్మ ఎలాగూ పెట్టదు, పెట్టే ముండకేమొచ్చింది’ అన్న తెలుగు సామెత స్వతంత్ర భారతాన్ని పునరుజ్జీవం చేసిన అపూర్వ వ్యక్తి, మాజీ ప్రధాని, దివంగత నేత శ్రీ పివి నరసింహారావుపట్ల అక్షరాలా నిజమౌతోంది. ఓ మాజీ ముఖ్యమంత్రి- తనయుడి లక్ష కోట్ల ఆర్జనకి సహకరించాడనడానికి తిరుగులేని ఋజువులున్నాయని సిబిఐ ఘోషిస్తూంటే- ఆయన జన్మదినాన్ని గుట్టుగానైనా సరే జరిపి తీరాలనుకునే కాంగ్రెస్ పార్టీకి- దేశానికీ, తమ పార్టీకీ కొత్త ఊపిరులు పోసిన పివిని స్మరించాలని తోచదు సరికదా- ఆయనపై బురదనైనా చల్లుతుంది. ఎవరైనా బురద చల్లుతుంటే కిమ్మనకుండా అర్థాంగీకారమనిపించేలా మౌనం వహిస్తుంది. పివి జన్మకు తెలుగువాడే కావచ్చు. కానీ ఆయన మానసికంగా భారతీయుడు. అవతార పురుషులకే మానవజన్మ కారణంగా చిన్న చిన్న లోపాలు తప్పనిసరి అన్న మాట నమ్మగలిగితే ఆయన మనకు నిజంగా అవతార పురుషుడు. అది గుర్తించని వ్యక్తులకీ, పార్టీలకీ, దేశానికీ మోక్షముండదని- ఆకాశంపై ఉమ్మి వెయ్యాలనుకునే సింగులూ, నయ్యరులూ, వారి అనుయాయులూ  తెలుసుకోవాలి.  ఇలాంటి ప్రయత్నాలు పివి గురించి మరింత ఆలోచింపజేస్తే- జనాలకు ఆయన ఔన్నత్యం మరింతగా ఆకళింపుకు వచ్చి- నేటి నేతక్ల గతి సహేంద్ర తక్షకాయస్వాహా అయ్యే అవకాశం ఉంది. శ్రీ ముళ్లపూడితో పాటు పివి జయంతిని సంస్మరించిన అక్షరజాలం, శ్రీ పివిని ప్రత్యేకంగా సంస్మరించిన Flat Forum  వ్యాసాలున్నాయి. ఈ విషయమై అక్షరజాలం రచయిత- శ్రీ టివిఎస్ శాస్త్రి స్పందనని ఈ క్రింద ప్రచురిస్తున్నాం.  

గత కొద్దికాలంగా పత్రికలలో, టీవీలలో విశేషంగా చర్చించబడుతున్నవిషయం శ్రీ’కుల’దీప్ నయ్యర్ వ్రాసి, విడుదల చేయబోతున్న ఆయన ఆత్మచరిత్ర అయిన ‘బియాండ్ ది లైన్స్’ను గురించే! ఆ పుస్తకంలో వ్రాసిన కొన్ని విషయాలు అవాస్తవాలుగా మరియు ఎవరో ప్రేరేపిస్తే దురుద్దేశ్యంతో వ్రాసినట్లుగా తోస్తుంది.
‘బాబ్రీ మసీదు కూల్చివేత’ అనేది ఇంకా ‘చరిత్ర’ కాలేదు. ఎలానంటే, ఆ సంఘటనను చూసిన మనమందరమూ ఇంకా సజీవంగానే వున్నాం! ఎంత దుస్సాహసం! 20 ఏళ్ళ సంగతినే ఇంత ఘోరంగా వక్రీకరించి వ్రాసిన రచయిత యొక్క నిజాయితీని అనుమానించవలసినదే! శ్రీ పీ.వీ.నరసింహారావు గారు ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఈ సంఘటనకు, కాంగ్రెస్సే కారణమనే భావన పూర్తిగా మైనారిటీ వర్గాల్లో ఉంది. స్వతహాగా కాంగ్రెసుకు అనుకూలురు, సంప్రదాయక ఓటర్లైనవారు కాలక్రమంలో ఆ పార్టీకి దూరమవుతూ వస్తున్నారు. ఆ తరువాత జరిగిన ఓటింగ్ సరళిని పరిశీలిస్తే, ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. అన్ని రాష్ట్రాలలో వరసగా పరాజయాన్నిపొందుతూ, పరపతినీ పోగొట్టుకోవటమే కాకుండా అనేక కుంభకోణాలతో కంపుకొడుతున్న కాంగ్రెసు పార్టీ నేతృత్వంలో నడుస్తున్నUPA, ప్రజల దృష్టిని వాటినుండి మరల్చి, మైనారిటీ ఓటర్లను తమవైపుకు తిప్పుకోవటానికి, చనిపోయిన ఒక తెలుగు ప్రధానిపై ఈ నేరాన్ని నెట్టివేసి లబ్ధిని పొందాలనే దురుద్దేశ్యం కనబడుతుంది. అటువంటి ఉద్దేశ్యపరుల ప్రేరణ ఈ పుస్తకం వెనక ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఆ పుస్తకంలోని విషయాలు ఎంత దారుణంగా వున్నాయంటే, ‘కుల’దీప్ నయ్యర్ అన్నీ తాను ప్రత్యక్షంగా చూసినట్లు కళ్ళకు కట్టినట్లు అసత్యాలను వ్రాయటం. మసీదు కూల్చి వేసినపుడు, శ్రీ నరసింహారావుగారు ఎంత కలత చెందారో మనకందరికీ తెలుసు. అంతేకాదు, అటువంటి విపత్తర, క్లిష్ట సమయంలో మనోధైర్యాన్ని వీడకుండా పరిస్థిని అతి నైపుణ్యంగా చక్కదిద్దారు. స్వతహాగా శ్రీ పీ.వీ, నరసింహారావుగారికి సోనియాగాంధీ కాంగ్రెసు పార్టీలోకి రావటానికి అంత సుముఖులు కారు. సోనియాగాంధీ కోటరీ కూడా శ్రీ పీ.వీని ఎలా పదవీచ్యుతుడిని చేసి పంపాలా అనే ఆలోచనలో వుండేది. ఈ విషయాలన్నీ అందరికీ తెలిసినవే! రాబోయే ఎన్నికల్లో, కాంగ్రెసు సొంతగా అధికారంలోకి వచ్చే సూచనలు మృగ్యం. కనీసం, సంకీర్ణ ప్రభుత్వాన్ని కూడా అది ఏర్పాటు చేసే అవకాశాలు కనబడటం లేదు. మరి ‘రాహు’ల్ గాంధి ప్రధాని అయ్యే అవకాశాలు లేవు. ఇటువంటి చిక్కు సమస్యల్లో వున్నవారి ప్రేరణ ఈ గ్రంధం వెనక తప్పక వుండి వుండవచ్చు. ఇందులో ఏ మాత్రం అనుమానంలేదు. ప్రజలందరూ జరిగిన దుస్సంఘటను మరచి, హాయిగా సహజీవనం చేస్తున్న ఈ తరుణంలో ఈ ప్రస్తావన తీసుకొని రావటం ఎంతవరకు సమంజసం? శ్రీ నరసింహారావు గారి వ్యక్తిత్వం తెలిసినవారు ఎంతగా బాధ పడుతున్నారో, ప్రస్తుత పరిణామాలను చూసి!వారిలో నేనూ ఒకడిని. స్వాభావికంగా శ్రీ నరసింహారావుగారు మృదుస్వభావి, పండితుడు, బహు భాషావేత్త, సాహితీప్రియుడు. సాహితీప్రియులకు ‘హితమే’తెలుస్తుంది. కట్టటమే తెలుస్తుంది, కూల్చటం తెలియదు. వారు ఎంత గొప్ప వ్యక్తో తెలుసుకోవాలంటే, ఒక్క ఉదాహరణ చాలు. జరిగిన సంఘటనకు ఎవరినీ బాధ్యులను చేయలేదు. నేరాన్ని ఎవరిమీదా రుద్దలేదు. కనీసం ఎవరితోనూ కఠినంగా మాట్లాడే వ్యక్తి కాదు. ఆయనకు కుల, మత, వర్గ రాజకీయాలంటే తెలియదు. కనీసం ఆయన తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పరుచుకుందామనే ఆలోచన కూడా లేని, నీచ రాజకీయాలు తెలియని విలువlunnaలున్న వ్యక్తి. వీటన్నిటినీ మించి సామాజికంగా, ఆర్ధికంగా బలహీనమైన వర్గానికి చెందిన వ్యక్తి. ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని, అయిదేళ్ల పాటు విజయవంతంగా నడిపి, పెక్కు ఆర్ధిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిని గురించి, ఆయన చనిపోయిన తరువాత కట్టుకథలను వ్రాసి లబ్ది పొందాలనే ఆలోచనే అతి నీచమైంది. దీన్ని గురించి దర్యాప్తు చేయించాలని అక్కడక్కడా కొద్దిమంది వ్యక్తపరుస్తున్నారు. దీనిని గురించి దర్యాప్తు చేయాలంటే, మనదేశంలో విశ్వసనీయ సంస్థ వుందా! మాయాదేవికి తాహతుకు మించిన ఆస్తులు లేవట! దాదాపుగా రెండు మూడు కార్లల్లో పెట్టెల నిండా కాయితాలు తీసుకొని ఉన్నత న్యాయస్థానాలకు, దర్యాప్తు సంస్థలు సమర్పించటం మనం చూస్తూనే ఉన్నాం. కొండను తవ్వకుండా ఎలుక కూడా పట్టుపడకుండా దర్యాప్తు చేస్తాయి మన దర్యాప్తు సంస్థలు. దేశంలోకెల్లా అతి పెద్ద కుంభకోణం అయిన 2G spectrum లో నిందితుడూ, మాజీ మంత్రి అయిన శ్రీ రాజాగారికి తమిళనాడులో అఖండ స్వాగత సత్కారాలు లభించాయి. కష్టాల్లో ఉన్నవాళ్ల మనిషిని వాళ్లు ఆదరిస్తారు, అతను ఎన్ని తప్పులు చేసినప్పటికీ! ఒక నిర్దోషిని, నిజాయితీపరుడైన సాటి తెలుగువాడిని అపకీర్తి పాలు చేస్తుంటే చేవచచ్చి కూచుంటాం మనం! ‘తెలుగుతనం’ అంటే ఇది కాదేమో! దీనిని ‘తెగులుతనం’ అందాం ముద్దుగా!
మృత్యువు కొంతమంది  అనర్హులకు, అయోగ్యులకు శాశ్వతకీర్తిని తెచ్చి పెడుతుంది, మరికొంతమంది యోగ్యులను  చనిపోయిన తరువాత కూడా వేధిస్తుంది, అపకీర్తి పాలు చేస్తుంది. శ్రీ పీ.వీ.నరసింహారావు గారి ఆత్మ శాంతించు గాక! ఆ ‘అపర చాణుక్యునికి’నా నివాళి!!

‘సత్యమేవజయతే!’

భవదీయుడు

టీ.వీ.ఎస్. శాస్త్రి

4 వ్యాఖ్యలు »

  1. SYAMPRASAD MAHANKALI said,

    idi chala darunam, chancha gallu ayina ArjunSingh,Kuldip Nayyar evarini meppinchadaniki ivi vrasaro prapamcham motham telusu.Arjun Singh raste ardham undi ,endukante ayanakeppudu Sri PVNR ante padadu, kani Kuldip nayyar lanti vallu evrini meppimchadaniko/book sales penchukodaniko evidhamga rayadam digajaradamlo parakasta. ayana okasari Sri PVRK Prasad& Dr.P.C.Rao garlu cheppindi vinte , tala ekkada pettukovalo telisi vastundi. ika AP congress leaders Soniano/Rajivno ante andari mida norlu paresukontaru, ippudu vallandari nollu padipoyayemo teliyadu .sorry for AP Congress people

  2. CS Sarma, Vijayawada said,

    Yes, he was blamed by Dweshies – CS Sarma


Leave a Reply

%d bloggers like this: