జూలై 23, 2012

మహాకవి దాశరథికి స్మృత్యంజలి

Posted in శాస్త్రీయం at 10:45 ఉద. by kailash

నిజాం పాలనలో ఇక్కట్లకు గురౌతున్న తెలంగాణ ఆంధ్రుల్ని మిగతా ఆంధ్రులతో కలిపి సమైక్యాంధ్ర సాధనకోసం పోరాటపటిమ చూపిన మహనీయుడు మహాకవి దాశరథి. తాను పుట్టిన గడ్డను ‘తెలంగాణ నా కోటి రత్నాల వీణ’ అనగల ఆయన మాతృభక్తి, కవితాస్ఫూర్తి అనన్యసామాన్యం. ఆంధ్రప్రదేశ్‍లో ఆంధ్రుల ఆస్థానకవిగా ఆ పీఠానికే వన్నె తెచ్చిన ఆ సాహితీమూర్తికి తెలుగు భాషమీద ఉన్నంత పట్టూ, ఉర్దూ మీదా ఉంది. అందుకు గాలిబ్ గీతాలకు ఆయన తెలుగుసేత ఒక నిదర్శనం. 1964 – 68 మధ్యకాలంలో ఆంధ్రా యూనివర్సిటీలో రీసెర్చి స్కాలరుగా ఉండగా – ఆయన గాలిబ్ గీతాలు పుస్తకం చదివి – గాలిబ్ భావాలకూ, ఆ తెలుగుసేతకూ, బాపు బొమ్మలకీ అబ్బురపడడం జరిగింది.  ఆ కవితలు హృదయంపై వేసిన శాశ్వతముద్రకు నిదర్శనం – 2009 జూన్ చతుర మాసపత్రికలో ప్రచురితమైన మా నవల ‘మోహినీ భస్మాసుర’. ఎన్నుకున్న కొన్ని  గాలీబ్ – దాశరథి కవితలు ఆ కథను ముందుకు నడిపించడానికీ, అలంకరించడానికీ సహకరించాయి. వేదికనెక్కినా, కవితలల్లినా, సినీ గీతాలు వ్రాసినా ఆయన ముద్ర ఆయనది. ఆయన తొలొ సినీ గీతం ఇద్దరు మిత్రులు చిత్రంలోని ‘ఖుషీ ఖుషీగా నవ్వుతూ అంటున్నారు శ్రీ టివిఎస్ శాస్త్రి. జాతి వైతాలికుల్ని సంస్మరించడంలో ముందుండే శ్రీ శాస్త్రి సకాలంలో అందజేసిన ఈ నివాళిని ఒక్క రోజు ఆలస్యంగా అందిస్తున్నందుకు వారూ, మీరూ మమ్మల్ని మన్నించాలి. ఐతే ఈ స్మృతి ఆలస్యమైనా విషం కాని, కాలేని అమృతమని కూడా మాకు తెలుసు.

2 వ్యాఖ్యలు »

  1. Narasimha said,

    Daasaradhi Krishnamacharyulu was the popular poet and writer of Telangana. provided all time famous songs. even though its one day- not too late.

    • CS Sarma, Vijayawada said,

      Dasarathi, wish you a happy telangana – CS Sarma


Leave a Reply

%d bloggers like this: