జూలై 26, 2012

శ్రీ వరలక్ష్మీవ్రతం

Posted in శాస్త్రీయం at 7:12 సా. by వసుంధర

భక్తికీ, నాస్తికత్వానికీ సమాన హోదా కల్పించిన హిందూత్వాన్ని చాలామంది మతంగా అపార్థం చేసుకుంటారు. వివాదాస్పదమైన విగ్రహారాథనకు వివేకానందుడి వంటి మహాజ్ఞానులు తగిన వివరణ ఇచ్చి ఉన్నారు. జీవితగమనంలో భక్తి ఒక మార్గం. అది ఆకర్షణీయం, ఆసక్తికరం కావడానికి ఎన్నో పూజలు, వ్రతాలు, నియమాలు. పతాక వందనాలు, కవాతులు, క్రీడలముందు ఉత్సవాలు సహజం అనుకునేవారికీ – అసలు ఒలింపిక్ క్రీడలెందుకూ, వాటికి నియమాలెందుకూ అని అడగాలని అనిపించనివారికీ ఈ తంతులు అర్థం కావు. స్వార్థానికి కాక, సర్వే జనాస్సుఖినో భవంతు అన్న ఆదర్శంతో చేసే పూజలు, వ్రతాలు మా బాల్యాన్ని కొత్త ఉత్సాహంతో నింపడం గుర్తుంది. ఇప్పటికీ ఎందరికో వ్రతాలు రొటీన్ జీవితంనుంచి కొంత ఉపశమనాన్ని కలిగిస్తూంటాయి. నచ్చనివారికి ఈ వ్రతాలు ఏమాత్రమూ బాధ్యత కాకపోవడం హిందూత్వం ప్రత్యేకత.

రేపు శ్రావణశుక్రవారం. ముఖ్యంగా మహిళలకు ఇది పర్వదినం. ఈ సందర్భంగా ప్రముఖ తెలుగు పత్రికలు వ్రత విధానాన్ని ప్రచురిస్తున్నాయి. పూజల్ని వ్యతిరేకించే నాస్తికవాదులు కూడా ఆ పత్రికల్లో ఆ సమాచారానికి అభ్యంతరం చెప్పకపోవడం గమనార్హం. అది కూడా హిందూత్వం ప్రత్యేకత.

నమ్మినవారికి పుణ్యం. నమ్మనివారికి ఆరోగ్యకరమైన వినోదం. గత సంవత్సరం నవ్య వారపత్రికలో వచ్చిన వ్రతవిధానానికి లంకె ఇక్కడ ఇస్తున్నాం. వ్రతవిధానం ఆడియో, నెట్‍లో కూడా లభ్యం. ఇక్కడ క్లిక్ చెయ్యండి. ఈ సందర్భంగా శ్రీ టీవీఎస్ శాస్త్రి అందజేస్తున్న ఆసక్తికర, ఉపయుక్తకర వివరాలకోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Leave a Reply

%d bloggers like this: