జూలై 30, 2012

సినారె అష్టపదిన్నొక్కటి

Posted in శాస్త్రీయం at 5:51 సా. by వసుంధర

మన ప్రాచీనులు వృత్తితో ముడిపెట్టిన కులం నేడు పుట్టుకతో ముడివడింది. కానీ జ్ఞానులు, పండితులు, విద్యావంతులు నిర్వచనం ప్రకారం బ్రాహ్మణులని స్వాభిప్రాయం. అలా మన సి నారాయణరెడ్డి బ్రాహ్మణోత్తములు. ఆయనకు జంధ్యం లేకపోతే – జగమెరిగిన బ్రాహ్మణునకు జంధ్యమేల – అన్న సూక్తి తెలిసిన విజ్ఞులన్న మాట! కవితామతల్లికి ఆయన సమక్షం నిత్యవసంతం అయిన వారు  నిన్నటితో తన జీవితంలో 81 వసంతాలు పూర్తి చేసుకున్నారు.  ఆయన సమకాలీనులు కావడం మన అదృష్టమైతే తరచుగా సభల్లో ఆయన్ని చూస్తూ, ఆయన గొంతు వినే భాగ్యం కలిగిన పౌరులున్న నగరం భాగ్యనగరమైంది. జ్ఞానపీఠాన్నలంకరించిన ఆ పద్మభూషణుడితో తెలుగు వన్ డాట్ కామ్ ముచ్చట్లకై ఇక్కడ క్లిక్ చెయ్యండి.

వారి సామాజిక స్పృహ చిన్న మాటల్లో ఎంత అద్బుతంగా వ్యక్తమౌతుందో తెలుసుకుందుకు – వేశ్యల గురించి ‘మన రక్తం పంచుకున్న ఆడపడుచులు, మనం జారవిడుచుకున్న జాతి పరువులు’ అన్న వారి ఆవేదన ఎందరినో వెంటాడుతుంది.  ఇంతకంటే గొప్పగా చెప్పడం అనితరసాధ్యం కదూ? 1970లలో వచ్చిన మానవుడు – దానవుడు చిత్రంలోని ఆ పాట పూర్తిగా వినడానికి  ఇక్కడ క్లిక్ చెయ్యండి.  ఇక సినారె కి మన శాస్త్రిగారి అభినందనలకై ఇక్కడ క్లిక్ చెయ్యండి.

ఆ మహామహునికి మరిన్ని వసంతాలతో మనకి వసంతోత్సవం జరగాలని అభిలషిస్తూ – వారికి అభివందనాలు!

1 వ్యాఖ్య »

  1. CS Sarma, Vijayawada said,

    Happy Birth day to Sri C. Narayana Reddy Garu. Some people believe, writing lyrics for Cinemas, lowers the imagae of the Kavi. But Sri CN Reddy proved it as wrong – CS Sarma.


Leave a Reply

%d bloggers like this: