ఆగస్ట్ 7, 2012

కథల పోటీ – జాగృతి

Posted in కథల పోటీలు at 12:48 సా. by వసుంధర

శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ తెలియజేస్తున్నారుః

వాకాటి పాండురంగరావు స్మారక జాగృతి కథా పురస్కారం

గత ఐదు సంవత్సరాలుగా జాగృతి నిర్వహిస్తున్న వాకాటి పాండురంగరావు స్మారక కథలో పోటీలో ఈ సంవత్సరానికిగాను ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇస్తున్నారు.

నియమాలు:
1. కథానిక సమకాలీన లేదా చారిత్రక నేపధ్యం కలిగి ఉండవచ్చు భారతీయసమాజ నేపథ్యం గలదై ఉండాలి
2. నిడివి 1500 పదాలకు మించరాదు
3. రచన తమ స్వంతమని, అనువాదంగాని, అనుసరణగానీ కాదని రచయిత హామీ పత్రం జతపరచాలి. ఈ రచన మరో పత్రికలో ప్రచురితమై ఉండరాదు. ఆకాశవాణిలోగాని, టీవి ఛానళ్ళలోగాని ప్రసారితమై ఉండరాదు. ఈ విషయాన్ని హామీపత్రంలో స్పష్టంగా ప్రకటించాలి.
4. బహుమతి పొందిన కథలనేగాక, మిగిలిన కథలలో నుండి ఏ కథనైనా సాధారణ ప్రచురణకు స్వీకరించే హక్కు జాగృతి సంపాదక వర్గానికి ఉంటుంది. అటువంటి
కథలకు సాధారణ రీతిలో పారితోషికం ఉంటుంది.
5. ప్రచురణకు స్వీకరించన కథలను త్రిప్పి పంపగోరువారు తమ చిరునామా వ్రాసి తగినన్ని తపాలాబిళ్ళలు అంటించిన కవరును కథతోపాటే జతపరిచి పంపించాలి.
6. కథల ఎంపికలో జాగృతి సంపాదక వర్గానిదే తుదినిర్ణయం – ఈ విషయమై ఉత్తరప్రత్యుత్తరాలు జరుపబడవు. ఎంపికైన కథల సమాచారం నేరుగా ఉత్తరం ద్వారా
తెలుపబడుతుంది.

కథలు చేరుటకు ఆఖరి తేదీ 10 సెప్టెంబరు 2012

కథలు పంపవలసిన చిరునామా
వాకాటి పాండురంగరావు స్మారక జాగృతి కథా పురస్కారం పోటీకి
జాగృతి భవనం, 3-4-228/4/1, లింగంపల్లి
కాచీగూడ, హైదరాబాద్ – 500 027

వివరాలకు జాగృతి మాసపత్రిక ఆగష్టు సంచిక చూడగలరు

Leave a Reply

%d bloggers like this: