ఆగస్ట్ 9, 2012

శివైక్యమైన సదాశివం

Posted in శాస్త్రీయం at 1:44 సా. by వసుంధర

చంద్రలోకానికి మనుషుల్ని పంపాం. ఇక్కడే ఉండి అంగారకుణ్ణి పరిశీలించగల్గుతున్నాం. అంతమాత్రాన సైంటిస్టులకి కూడా భూమి గురించి పూర్తిగా తెలుసు అనుకుందుకు లేదు. హైదరాబాదులో ఉంటూ, సాహితీవ్యాసంగంపట్ల ఆసక్తి ఉన్న మా పరిస్థితీ ఇందుకు భిన్నం కాదు. రెండేళ్ల క్రితం వరకూ శ్రీ సామల సదాశివ పేరు కూడా మాకు తెలియదు. వారి రచన యాది గురించి కూడా మేము వినలేదు. శ్రీ పెద్దాడ వెంకటేశ్వర్లు అనే రచయిత, సాహిత్యాభిమాని మరో ప్రముఖ రచయిత ఎలక్ట్రాన్ ద్వారా మాకు యాది పుస్తకం పంపి వీలైనంత తొందరగా రచనలో పరిచయం చెయ్యమని ఇంచుమించు ఆదేశించారు. ఆ పుస్తకం చదవడం ఒక అనుభవం. ఆ పుస్తకం ద్వారా పరిచయమైన శ్రీ సామల సదాశివ వ్యక్తిత్వం విశిష్టం.  ఆ పుస్తకాన్ని 2011 ఫిబ్రవరి రచన మాసపత్రికలో పరిచయం చేశాం. ఆ వెంటనే అక్షరజాలంలోనూ ఆ వివరాలు అందజేశాం.

కొద్ది సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీ సదాశివ మనకిక లేరు. ఆ మహామహుని గురించిన అపురూప విశేషాలతో శ్రీ టీవీఎస్ శాస్త్రి అందజేసిన సంస్మరణ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి. అక్షరజాలంలో యాది పుస్తకం వివరాలకు ఇక్కడా, పుస్తక పరిచయానికి ఇక్కడా క్లిక్ చెయ్యండి.

1 వ్యాఖ్య »

  1. chala badhagaa vundi….sadasiva meeku inta latuga parichayamayyadaa ani aascharyam vesindi…meeru yadi pustakam dwara aa sunyanni pudcharu


Leave a Reply

%d bloggers like this: