ఆగస్ట్ 12, 2012
భాషే శ్వాసగా మిగిలిన భద్రిరాజు
ఇరవయ్యవ శతాబ్దపు భాషాశాస్త్ర కోవిదులలో ఎన్నదగ్గ వ్యక్తి ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి. భాషాశాస్త్రాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి, అధ్యాపనం చేయగల సత్తా నిరూపించుకున్న పండితుడు భద్రిరాజు కృష్ణమూర్తి. 84 సంవత్సరాల వయసులో – నిన్న, అనగా ఆగస్ట్ 11 (2012) ఉదయం హైదరాబాదులో మెడిసిటి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అంతిమ శ్వాస విడిచారు. ఐతే భాషలో వారి శ్వాస మనకు నిత్యానుభూతి కాగలదన్నది పరమసత్యం.
భాషాభిమానులందరూ వారికి నివాళులు అర్పిస్తున్నారు. శ్రీ టివిఎస్ శాస్త్రి బాష్పాంజలికై ఇక్కడ క్లిక్ చెయ్యండి.
రాజశేఖర రాజు said,
ఆగస్ట్ 12, 2012 at 1:07 సా.
వసుంధర గారూ,
నమస్కారమండీ, కుశలమేనా?
ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారికి నివాళిగా ఆయన విశిష్టకృషిపై ఆన్లైన్లో వచ్చిన సమాచారమంతటినీ ఒకే చోట చేర్చి నిన్ననే కింది వ్యాసంలో పొందుపర్చాను. వీలయితే చూడగలరు.
ద్రావిడ భాషల యుగకర్త భద్రిరాజు కృష్ణమూర్తి ఇక లేరు….
http://blaagu.com/chandamamalu/2012/08/11/%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A1-%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B7%E0%B0%B2-%E0%B0%AF%E0%B1%81%E0%B0%97%E0%B0%95%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4-%E0%B0%AD%E0%B0%A6%E0%B1%8D/