ఆగస్ట్ 13, 2012
అంబల్ల జనార్దన్ – ఒక ఆదర్శం
ప్రముఖ రచయిత అంబల్ల వసుంధరకు వ్రాసిన లేఖనూ వారు పంపిన ఫొటోలనూ ఈ క్రింద జత పర్చుతున్నాం. ప్రయోజనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శ్రీ జనార్దన్కి అక్షరజాలం అభివందనాలు.
వసుంధర గార్లకు,
నమస్కారం. స్వప్న మాస పత్రిక, జులై, 2012 లో వచ్చిన మీ పార్థుడూ పార్థివమూ ఆలోచింప జేసేదిగా ఉంది. నేను అది కనీసం నాలుగు సార్లు చదివాను, ప్రతిసారీ ఏదో కొత్తదనం కనిపిస్తోంది. పార్థివ దేహానికి అంతిమ సంస్కారం విషయంలో మీ భావాలను సున్నితంగా ప్రకటించారు.
ఉద్వేగమునకు లోనైన పార్థసారథి, మంచి మనసున్నా,ప్రాక్టికల్ గా అలోచించి, ఆచరించే విశ్వం పాత్రలు పాఠకులపై చెరగని ముద్ర వేస్తాయి. పనిలో పనిగా నేటి ప్రచార మాధ్యమాల పనితీరుపై వ్యంగాస్త్రం సంధించారు. అభినందనలు.
సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. డిసెంబర్,2008 లో,నేను నా కుటుంబ సభ్యుల అనుమతితో, నా పార్థివ దేహాన్ని గ్రాంట్ మెడికల్ కాలేజి, ముంబయి వారికి ఇస్తానని తెలిపాను.
మీ సమాచారంకోసం దానికి సంబంధించిన పత్రాలు జతపరిచాను.
మీ అభిమాని,
అంబల్ల జనార్దన్
రాజశేఖర రాజు said,
ఆగస్ట్ 13, 2012 at 11:56 సా.
పార్థుడూ-పార్థివమూ కథ ఇప్పుడే ఈ లింకు ద్వారా చదివాను. ఒక్క ముక్కలో చెప్పాలంటే చందమామ కథకు ఇది ఆధునిక రూపం. ముగింపు చదువుతుంటే కళ్లు చెమర్చాయి. అంతిమ సంస్కారానికి కూడా డబ్బులు లేని దశలోకి సమాజం వచ్చేసిన పరిణామానికి మీ కథ ఒక నగ్న ప్రతిఫలనం. ఇంతకుమించి ఏమీ చెప్పలేను.
shri said,
ఆగస్ట్ 13, 2012 at 11:05 సా.
అందరూ మనసు పెట్టి ఆలోచించి,కొందరైనా చెయ్య వలసిన పని.
కీర్తిశేషులు అవసరాల మాస్టారు ఈ ప్రయోజనం కోసం పాటుపడ్డారు.
చాలా మంచి పని ఇది.
అభినందనలు
శ్రీదేవి