ఆగస్ట్ 29, 2012

రంజని – విశ్వనాథ పద్య కవితా పోటీలు : 2012.

Posted in కథల పోటీలు at 6:58 సా. by వసుంధర

అకౌంటేంట్ జనరల్ గా పదవీ విరమణ చేసి అమెరికాలో ఉంటోన్న శ్రీ ఎ.సత్యవర్ధన ఐ.ఎ.ఎస్. గారి సౌజన్యంతో రంజని, తెలుగులో ప్రథమ జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ పేరుతో 2008 నుంచీ ‘రంజని-విశ్వనాథ పద్య కవితా పోటీలు’ నిర్వహిస్తోంది. 2012 సంవత్సరానికి ‘నేటి నిజం’ దిన పత్రికతో కలసి ఈ పోటీలను సం యుక్తం గా నిర్వహిస్తోంది.

ప్రధమ బహుమతి 2,000 రూ.లు.  ద్వితీయ బహుమతి 1,500 రూ.లు.  మూడు ప్రత్యేక బహుమతులు 1,500 రూ.లు + యోగ్యతా పత్రాలూ.

నిబంధనలు:
*ఏ చందస్సులోనయినా ఒక అంశం మీదే 12 పద్యాలకు తక్కువ కాకుండా ఉండాలి.
* ఇంత వరకూ ప్రచురణ, ప్రసారం కానివై వుండాలి.
* ఎన్ని శీర్షికలైనా పంపొచ్చు.
* పద్య కవితని, హామీ పత్రాన్నీ వేరు వేరు గా రాసి పంపాలి. పద్య కవిత ఉన్న కాగితం పై పేరు, విలాసం ఏదీ రాయకూడదు.

ప్రధాన కార్య దర్శి, రంజని, తెలుగు సాహితీ సమితి, ఏ.జి. ఆఫీస్, హైదరా బాద్ – 500 004 అనే చిరునామాకి 31.8.2012 లోగా అందేలా పంపాలి.

చీకోలు సుందరయ్య (అధ్యక్షులు)
90300 00696

మట్టిగుంట వెంకటరమణ
ప్రధాన కార్యదర్శి
93968 40890.

ఈ సమాచారం అందజేసిన  శ్రీమతి ఆర్.దమయంతికి ధన్యవాదాలు.

Leave a Reply

%d bloggers like this: