సెప్టెంబర్ 12, 2012

నింగి కెగసిన తార రోహిణి

Posted in సాంఘికం-రాజకీయాలు at 11:04 ఉద. by వసుంధర

శ్రీ రోహిణీ ప్రసాద్ మహా రచయిత శ్రీ కొడవటిగంటి కుటుంబరావు కుమారుడు. ఆయన చదువు అణు విజ్ఞానం. అభిరుచి సంగీతం, సాహిత్యం. చదువులోనూ, అభిరుచిలోనూ స్థాయిలో మింటికెగసిన ఈ రోహిణి ఇంటి పేరుకి గౌరవాన్నార్జించిపెట్టిందే తప్ప దాన్ని ఆలంబనగా తీసుకోలేదు. పేరుకే కాక సాఫల్యంలోనూ తారగా నేలపై వెలిగిన ఆ మహనీయుడు, నేల విడిచి సాము చెయ్యడమెరుగని ఆ వినయ సంపన్నుడు, తెలుగునాట లేకపోయినా తెలుగుకు వెలుగైన ఆ భాషా ప్రేమికుడు – సెప్టెంబర్ 9న, సరిగ్గా తన 64వ జన్మదినానికి ఐదు రోజులముందు నింగికెగయడం ఆశ్చర్యం. ఆ విషాదవార్తకు విచలితులైనవారు ఒకరా, ఇద్దరా, ఎందరో! ఈ సందర్భంగా వారి గురించిన పూర్తి వివరాలతో శ్రీ రాజశేఖర రాజు అర్పించిన నివాళిని ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రత్యేక వ్యాసంగా ప్రచురించింది. శ్రీ అంబల్ల జనార్దన్ ద్వారా మాకందిన ఆ నివాళికై ఇక్కడ క్లిక్ చెయ్యండి.

4 వ్యాఖ్యలు »

  1. C. S. Sarma said,

    May the God, rest his soul, in peace


Leave a Reply

%d bloggers like this: