అక్టోబర్ 6, 2012

వివాహ భోజనంబు- ఆంగ్ల మాతృక

Posted in సంగీత సమాచారం at 3:50 సా. by వసుంధర

భాషకు, సంగీతానికి ఎల్లలు లేవు. అచ్చ తెలుగు చిత్రం మాయా బజార్‍లో అచ్చ తెలుగు పాట వివాహ భోజనంబు అచ్చ తెలుగువాడు ఘంటసాల సంగీతంలో అచ్చ తెలుగు ఉచ్చారణలో మాధవపెద్ది నోట ఆచంద్ర తారార్కమై నిలిచిపోయింది. ఆ పాట గురించి శ్రీదేవి మురళీధర్ సేకరించిన సమాచారమిదిః

‘వివాహభోజనంబు’ పాటకు మాతృక: The Laughing Policeman – Charles Jolly (ఇంగ్లీష్ పాట). ఈ స్ఫూర్తితో 1939లో వచ్చిన  మాయాబజార్ (శశిరేఖ పరిణయం) చిత్రంలోను, సురభి వారి మాయాబజార్ నాటకంలోను- ఈ పాటను సన్నివేశానికి అనుగుణంగా కూర్చి వాడుకున్నారు. జనాదరణ పొందిన ఈ పాటను విజయా వారు యధాతధంగా అజరామరంగా తెరకెక్కించారు.

మూలం ఏదైనా సాహిత్యం, సంగీతం, చిత్రీకరణ- ఈ పాటను అచ్చ తెనుగు పాటను చేశాయి. మూలానికి వందనాలు. అనుకరణకి అభివందనాలు. ఈ సమాచార సేకరణకి శ్రీదేవి మురళీధర్‍కి ధన్యవాదాలు.

 


2 వ్యాఖ్యలు »

  1. మీరు సేకరిణి రాసిన సమాచారం అంతా బాగుంది.కాని ఒక సవరణ .ఆ పాట రంగారావుగారికి ప్లేబాక్ పాడింది ఘంటసాలవారు కాదు.మాధవపెద్ది సత్యంగారు.అందులో ఘటోత్కచుడి పద్యాలు చదివింది కూడా ఆయనే.

    • ఆ వాక్యంలో కొన్ని పదాలు మిస్సయ్యాయి. మీరు వెంటనే తెలిపినందుకు ధన్యవాదాలు. ఆ మేరకు సవరించడం జరిగింది.


Leave a Reply

%d bloggers like this: